Private Schools : ప్రైవేటు పాఠశాలలో 25 శాతం ఉచిత సీట్లు కేటాయించాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఫ్రీ సీట్లు కేటాయింపు జీవోను అమలు చేయాలని ఉచిత విద్య విదార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు కొమ్ము సత్తిబాబు డిమాండ్ చేశారు. ఆదివారం రాజమహేంద్రవరం గోరక్షణ పేట కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరుకు దేశవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఫ్రీ సీట్లు కేటాయించాలని జీవో విడుదల చేశారని. కొన్ని రాష్ట్రాలలో జీఓ అమలు జరుగుతుండగా మన రాష్ట్రంలో మూడు సంవత్సరాల నుంచి అడ్మిషన్లలో స్పష్టత లేదని తెలిపారు.
Job Mela: రేపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళా
డీఈవోలు సీట్ల కేటాయింపును తూతూ మంత్రంగా అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయిస్తున్నప్పటికీ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం వాటిని సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. 24 జీవో ప్రకారం అమ్మ ఒడి పడే విద్యార్థులకు మినహాయింపు ఉందని స్కూల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయన్నారు. విద్యార్థులు ఫీజు కట్టాల్సిందేనని తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నాయని, అరికట్టాలని కోరారు. కార్యదర్శి సుధీర్, అంబేద్కర్, సంఘం నాయకులు రవి ,రాజ్ కుమార్,దేవి, కరీముల్లా, శ్రీనివాస్ పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- ap private schools
- free seats for students
- 25 percent free seats
- Supreme Court
- AP government
- Free seats GO
- free seats at ap private schools
- Schools
- School admissions
- fees for private schools
- 25 percent free seats at private schools
- all india private schools
- students education
- Education News
- Sakshi Education News