Skip to main content

Penukula Shravika & B Ganesh: ప్రబుత్వ ఉద్యోగాలకు ఎంపికైన‌ సీఓఈ కళాశాల ఉపాధ్యాయులు మనోగతం

COE college teachers selected for government jobs

పీజీటీ, టీజీటీలో ఎంపికయ్యాను

సీఓఈ కళాశాలలో పార్ట్‌ టైం టీచర్‌గా పని చేశాను. విద్యార్థులకు విద్యాబోధన చేయడం వల్ల ఎన్నో అంశాల పై అవగాహన ఏర్పడింది. వివాహ అనంతరం 12 ఏళ్ల తర్వాత తిరిగి ఉపాధ్యాయురాలుగా నన్ను నేను నిలబెట్టుకున్నాను. నా భర్త సహకారంతో ప్రణాళికాబద్దంగా చదివి పీజీటీ, టీజీటీలో ఉద్యోగాలకు ఎంపియ్యాను.

పెనుకుల శ్రావిక

సీఓఈ గురుకులం కన్నతల్లి వంటిది

నా ఉపాధ్యాయ జీవితం సీఓఈ గురుకులం నుంచి ప్రారంభమైంది. ఆ సంస్థ నాకు కన్నతల్లి వంటి ది. ప్రశాంతంగా ఉన్న నా జీవితంలో ఒక్కసారిగా యాక్సిడెంట్‌తో అల్లకల్లోలంగా మారింది. ఓ కాలు ను కోల్పోయాను. రెండేళ్లు మంచానికే పరి మితం అయ్యాను. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా గురుకుల ఉద్యోగాల నోటిఫికేషన్‌ రావడంతో దరఖాస్తు చేసి ప్రస్తుతం వెలువడిన ఫలితాల్లో డిగ్రీ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించడం ఆనందంగా ఉంది.
బి.గణేష్‌

Published date : 04 Mar 2024 04:02PM

Photo Stories