Singareni Exam: 20న సింగరేణి నియామక పరీక్షలు.. అభ్యర్థులకు ప్రత్యేక సూచనలు ఇవే
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థలో 272 ఎక్స్‌టర్నల్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ కేంద్రంగా జూలై 20, 21వ తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) నిర్వహించ నునట్లు సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ జూలై 18న తెలిపారు.
మొత్తం 18,665 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లను జారీ చేసినట్లు వెల్లడించారు. అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలన్న ఉద్దేశంతో సింగరేణి చరిత్రలో తొలి సారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో వివరించారు.
చదవండి: Singareni Jobs: సింగరేణిలో మహిళలకూ ‘కారుణ్యం’
పోటీ పరీక్షల నిర్వహణలో విశేష అనుభవం ఉన్న కేంద్ర ప్రభు త్వ రంగ సంస్థ ఈడీసీఐఎల్ ఆధ్వర్యంలో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు, ఈ మేరకు హైదరాబాద్‌లోని 12 కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అభ్యర్థులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు.
- పరీక్షకు గంటన్నర ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
- పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పరీక్షా కేంద్రం గేట్లు మూసేస్తారు.
- అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని ప్రభుత్వ ఫొటో గుర్తింపు కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజు కలర్ ఫొటోలు తీసుకురావాలి.
- పరీక్షా కేంద్రంలో పరీక్షకు ముందు, తర్వాత వారి అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తారు.
- అడ్మిట్ కార్డులో తెలిపిన సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదు. ∙అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినట్లైతే హెల్ప్ డెస్క్ నెం. 08744–249992ను సంప్రదించవవచ్చు.
Published date : 19 Jul 2024 03:27PM
Tags
- Singareni Exam
- Singareni Recruitment Tests
- CBT Test
- N Balaram
- EDCIL
- Telangana News
- Singareni Corporation recruitment
- CMD N. Balaram announcement
- Computer Based Test 2024
- CBT July 20 and 21
- External posts recruitment
- Singareni job vacancies
- Singareni CBT exam dates
- Hyderabad recruitment news
- 272 external posts Singareni
- Job vacancies in Singareni
- SakshiEducation latest job notifications