Singareni Jobs: సింగరేణిలో మహిళలకూ ‘కారుణ్యం’
Sakshi Education
సింగరేణి (కొత్తగూడెం): మహిళలకు అండర్ గ్రౌండ్, పర్సనల్ విభాగాల్లో నియామక అవకాశాలు కల్పించిన సింగరేణి.. తాజాగా జూలై 9న మరో సువర్ణావకాశం కల్పించింది.
ఇప్పటివరకు కుమారులకే పరిమితమైన కారుణ్య నియామకాలను కూతుళ్లకు కూడా వర్తింపజేస్తూ జూలై 9న ఉత్తర్వులు జారీచేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగి వివిధ కారణాలతో మృతిచెందితే ఆయన స్థానంలో కుమారులకు ఇచ్చేవారు. వారికి 18 ఏళ్ల వయసు లేకుంటే వచ్చేంతవరకు ఆపి.. 18 ఏళ్లు నిండాక ఉద్యోగం ఇచ్చేవారు.
చదవండి: SCCL Recruitment Board: బీటెక్ ఫైనలియర్ విద్యారులూ అర్హులే..
పురుషులకు మాత్రమే ఉన్న ఈ వెసులుబాటును ఇక నుంచి మహిళలకు కూడా వర్తింపజేస్తున్నారు. ఈ మేరకు అన్ని ఏరియాల జీఎంలకు సమాచారం అందించారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఇటీవల కొందరు తప్పుడు సమాచారంతో (కొడుకులు, అల్లుళ్లు కానివారు కూడా) విధుల్లో చేరుతున్న నేపథ్యంలో ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు సంస్థ మంచి నిర్ణయం తీసుకుందని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Published date : 10 Jul 2024 01:17PM