Admission in NIRDPR: ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(ఎన్‌ఐఆర్‌డీపీఆర్).. దూరవిద్యా విధానంలో 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
పీజీ డిప్లొమా ఇన్ సస్టైన్‌బుల్ రూరల్ డెవలప్‌మెంట్(పీజీడీఎస్‌ఆర్‌డీ) 14వ బ్యాచ్(2022–23):
అర్హత: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు వ్యవధి: 18 నెలలు.
పీజీ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్(పీజీడీటీడీఎం) 11వ బ్యాచ్(2022–23):
అర్హత: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు వ్యవధి: 18 నెలలు.
పీజీ డిప్లొమా ఇన్ జియో స్పేషియల్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఇన్ రూరల్ డెవలప్‌మెంట్(పీజీడీజీఏఆర్‌డీ) 7వ బ్యాచ్(2022–23):
అర్హత: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు వ్యవధి: 18 నెలలు.
డిప్లొమా ప్రోగ్రామ్ ఆన్ పంచాయతీరాజ్ గవర్నెన్స్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (డీపీ–పీఆర్‌జీఆర్‌డీ) 4వ బ్యాచ్(2022):
అర్హత: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
కోర్సు వ్యవధి: 12 నెలలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.01.2022
వెబ్‌సైట్: http://nirdpr.org.in/
చదవండి: Admission in PDEU: పీడీఈయూలో ఎంబీఏ 2022 ప్రవేశాలు