BIT Noida: బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నోయిడాలో బ్యాచిలర్ కోర్సుల్లో ప్రవేశాలు
రాంచీ(మెస్రా)లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(బిట్స్), నోయిడా క్యాంపస్‌లో 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
బీబీఏ(బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్):
స్పెషలైజేషన్లు: ఫైనాన్స్, ఐటీ, మార్కెటింగ్, హెచ్‌ఆర్.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ /తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
బీసీఏ(బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్):
స్పెషలైజేషన్లు: ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా అనలిటిక్స్ తదితరాలు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
బీఎస్సీ(యానిమేషన్ అండ్ మల్టీమీడియా):
స్పెషలైజేషన్లు: 2డీ యానిమేషన్, 3డీ మోడలింగ్ అండ్ యానిమేషన్, గేమ్ డిజైన్, డిజిటల్ ఫిల్మ్ మేకింగ్, కంపోజిటింగ్ అండ్ వీఎఫ్‌ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ డిజైన్.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: క్రియేటివ్ అప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.11.2021
వెబ్‌సైట్: https://bitmesra.ac.in/