Skip to main content

UPSC Geoscientist Exam 2024: కేంద్రంలో.. కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ పోస్టుల వివరాలు.. పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగార్థులకు మరో జాబ్‌ నోటిఫికేషన్‌! జియాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ల్లో పీజీ ఉత్తీర్ణులకు చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది. కేంద్ర గనులు, జల వనరుల శాఖల్లో.. గ్రూప్‌–ఎ హోదాలో ఉద్యోగం సొంతం చేసుకునేందుకు మార్గం.. యూపీఎస్సీ కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ పరీక్ష!! యూపీఎస్‌సీ తాజాగా కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది! ఈ నేపథ్యంలో..కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ పోస్టుల వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..
Key Details of UPSC Combined Geo Scientist Exam 2024.UPSC Central Mines and Water Resources Department Vacancies. UPSC Exam Procedure for Combined Geo Scientist Exam.,upsc geoscientist exam 2024 notification, exam pattern & preparation tips
  • కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ విడుదల
  • మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహణ
  • విజయం సాధిస్తే గ్రూప్‌–ఎ హోదాలో ఉద్యోగం

మొత్తం 56 పోస్టులు

  • యూపీఎస్సీ.. కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ, జల వనరుల మంత్రిత్వ శాఖల్లో స్పెషలైజ్డ్‌ పోస్ట్‌ల భర్తీ చేపడుతోంది. ఈ పోస్ట్‌లను రెండు కేటగిరీలుగా వర్గీకరించింది. రెండు కేటగిరీలలో కలిపి మొత్తం 56 పోస్ట్‌లకు ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. 
  • కేటగిరీ–1: కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో ఉన్న మూడు విభాగాల పోస్ట్‌లను ఈ కేటగిరీలో పేర్కొన్నారు.
    అవి.. జియాలజిస్ట్‌ గ్రూప్‌–ఎ: 34 పోస్ట్‌లు; జియో ఫిజిసిస్ట్‌: 1 పోస్ట్‌; కెమిస్ట్‌– గ్రూప్‌–ఎ: 13.
  • కేటగిరీ–2: సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డ్, జల్‌శక్తి శాఖ, జల వనరుల శాఖ, నదీ అభివృద్ధి–గంగానది పరిశుద్ధి విభాగాల్లో మూడు రకాల పోస్ట్‌లను ఈ కేటగిరీలో పేర్కొన్నారు. అవి.. సైంటిస్ట్‌–బి(హైడ్రాలజీ) గ్రూప్‌–ఎ: 4 పోస్ట్‌లు, సైంటిస్ట్‌–బి(కెమికల్‌) గ్రూప్‌–ఎ: 2 పోస్ట్‌లు, సైంటిస్ట్‌–బి(జియో ఫిజిక్స్‌) గ్రూప్‌–ఎ: 2 పోస్ట్‌లు.

చదవండి: UPSC Jobs: యూపీఎస్సీ–కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామ్‌–2024 నోటిఫికేషన్‌ను విడుదల

పోస్టులు–విద్యార్హతలు

  • జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో జియాలజిస్ట్‌: జియలాజికల్‌ సైన్స్‌/ జియాలజీ/అప్లైడ్‌ జియాలజీ/జియో ఎక్స్‌ప్లొరేషన్‌/మినరల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌/ఇంజనీరింగ్‌ జియాలజీ/మెరైన్‌ జియాలజీ/ఎర్త్‌ సైన్సెస్‌ అండ్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ /ఓషనోగ్రఫీ అండ్‌ కోస్టల్‌ ఏరియా స్టడీస్‌/పెట్రోలియం జియో సైన్సెస్‌/జియో కెమిస్ట్రీ స్పెషలైజేషన్లలో ఏదో ఒక స్పెషలైజేషన్‌లో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
  • కేటగిరీ–1లోని జియో ఫిజిసిస్ట్, కేటగిరీ–2లోని జియోఫిజిక్స్‌ సైంటిస్ట్‌–బి: ఫిజిక్స్‌/అప్లైడ్‌ ఫిజిక్స్‌/జియో ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ లేదా ఎక్స్‌ప్లొరేషన్‌ జియో ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ/ఎమ్మెస్సీ అప్లైడ్‌ జియో ఫిజిక్స్‌/ఎమ్మెస్సీ మెరైన్‌ జియో ఫిజిక్స్‌/ఎమ్మెస్సీ టెక్‌(అప్లైడ్‌ జియో ఫిజిక్స్‌)లలో ఉత్తీర్ణత సాధించాలి.
  • కేటగిరీ–1లోని కెమిస్ట్, కేటగిరీ–2లోని సైంటిస్ట్‌–బి(కెమికల్‌): కెమిస్ట్రీ లేదా అప్లైడ్‌ కెమిస్ట్రీ లేదా అనలిటికల్‌ కెమిస్ట్రీలలో ఎమ్మెస్సీ ఉత్తీర్ణతను అర్హతగా నిర్దేశించారు.
  • కేటగిరీ–2లోని హైడ్రాలజీ సైంటిస్ట్‌: జియాలజీ/అప్లైడ్‌ జియాలజీ/మెరైన్‌ జియాలజీ /హైడ్రో జియాలజీలలో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 
  • ఈ కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వయసు: జనవరి 1, 2024 నాటికి 21–32 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్‌సీ/ఎస్టీ అభ్యర్థులకు అ­యిదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఇస్తారు

మూడు దశల ఎంపిక ప్రక్రియ
కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడంచెలుగా ఉంటుంది. తొలుత స్టేజ్‌–1లో ప్రిలిమినరీ పరీక్షను, స్టేజ్‌–2లో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. ఈ రెండింటిలోనూ విజయం సాధించి మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి చివరగా పర్సనాలిటీ టెస్ట్‌(ఇంటర్వ్యూ) ఉంటుంది.

చదవండి: UPSC ESE 2024 Notification: కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజనీరింగ్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా‌..

ప్రిలిమినరీ 400 మార్కులు

  • ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది. ఇది ఆయా పోస్ట్‌ల అభ్యర్థులకు వేర్వేరుగా నిర్వహిస్తారు. పేపర్‌–1కు 100 మార్కులు, పేపర్‌–2కు 300 మార్కులు కేటాయించారు. పేపర్‌–1 జనరల్‌ స్టడీస్‌ కాగా, పేపర్‌–2 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌కు సంబంధించినది. 
  • పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తా­రు.నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన అమల్లో ఉంది. పరీక్ష సమయం ఒక్కో పేపర్‌కు రెండు గంటలు.

మెయిన్‌ డిస్క్రిప్టివ్‌ విధానం

  • ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఆయా కేటగిరీల్లోని పోస్ట్‌ల సంఖ్యను అనుసరించి.. ఒక్కో పోస్ట్‌కు ఆరు లేదా ఏడుగురిని చొప్పు­న రెండో దశ మెయిన్‌ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్ష పూర్తిగా సబ్జెక్ట్‌ పేపర్లతో డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్ట్‌కు సంబంధించి మూడు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 200 మార్కులు చొప్పున మొత్తం 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. 
  • జియాలజిస్ట్‌ పోస్ట్‌లకు జియాలజీ నుంచి మూ­డు పేపర్లు; జియో ఫిజిస్ట్, జియోఫిజిక్స్‌(సైంటిస్ట్‌–బి) పోస్ట్‌లకు జియో ఫిజిక్స్‌లో మూడు పేపర్లు; కెమిస్ట్, సైంటిస్ట్‌–బి(కెమికల్‌) పోస్ట్‌లకు కెమిస్ట్రీ నుంచి మూడు పేపర్లు; సైంటిస్ట్‌–బి హైడ్రాలజీ పోస్ట్‌లకు జియాలజీ నుంచి రెండు పేపర్లు(పేపర్‌–1, పేపర్‌–2), హైడ్రాలజీ నుంచి ఒక పేపర్‌(పేపర్‌–3)గా పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో జరుగుతుంది.

పర్సనల్‌ ఇంటర్వ్యూ
మెయిన్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ఇద్దరు చొప్పున(1:2 నిష్పత్తిలో) ప­ర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 200 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్‌/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ దశలో..అభ్యర్థుల్లోని సబ్జెక్ట్‌ నైపుణ్యాలను ప్రత్య­క్షంగా తెలుసుకోవడమే కాకుండా..వ్యక్తిత్వం, నా­యకత్వ లక్షణాలు, సామాజిక అంశాలపై అవగాహన, దృక్పథం తదితర అంశాలను పరిశీలిస్తారు.

విజయం సాధించాలంటే

  • మూడు దశలుగా నిర్వహించే.. కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎంపిక ప్రక్రియలో రాణించేందుకు అభ్యర్థులు ప్రిలిమినరీ దశ నుంచే పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించాలి. 
  • ప్రిలిమినరీ పరీక్షలోని జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ కోసం జాతీయ,అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగి­న సమకాలీన అంశాలు,భారత చరిత్ర, స్వాతంత్య్రోద్యమం, పాలిటీ, పరిపాలన, ఎకానమీ, సామాజిక అభివృద్ధి అంశాలు, పర్యావరణం, జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు, జనరల్‌ సైన్స్‌లో ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టాలి.
  • సబ్జెక్ట్‌ పేపర్‌గా ఉండే పేపర్‌–2 కోసం అభ్యర్థు­లు తాము ఎంచుకున్న సబ్జెక్‌కు సంబంధించి.. పీజీ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయా­లి. అదే విధంగా వాటిని అప్లికేషన్‌ ఓరియెంటేషన్, వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ అభ్యసిస్తే మరింత మెరుగైన ఫలితం పొందొచ్చు.

మెయిన్‌తో అనుసంధానం
ప్రిలిమినరీ పరీక్షలోని పేపర్‌–2ని, మెయిన్‌ ఎ­గ్జామినేషన్‌తో అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది. మెయిన్‌లోని మూడు పేపర్లు కూడా అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించినవే. దీంతో ప్రిలిమినరీ ప్రిపరేషన్‌ దశ నుంచే సబ్జెక్ట్‌ పేపర్‌ను మెయి­న్‌ పరీక్ష కోణంలో విశ్లేషణాత్మకంగా, డిస్క్రిప్టివ్‌ వి­ధానంలో చదివితే.. ప్రిలిమ్స్‌ పేపర్‌–2 (సబ్జెక్ట్‌ పేపర్‌), మెయిన్‌ ఎగ్జామ్‌ పేపర్లకు సన్నద్ధత లభిస్తుంది. ప్రిలిమినరీ పరీక్ష పూర్తయిన తర్వాత మెయిన్‌ ఎగ్జామ్‌కు నాలుగు నెలల సమయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో పూర్తిగా సబ్జెక్ట్‌ పేపర్లను సిలబస్‌కు అనుగుణంగా వెయిటేజీని గుర్తిస్తూ ప్రిపరేషన్‌ సాగించాలి. తద్వారా మెయిన్‌లోనూ ప్రతిభ చూపి.. చివరి దశ ఇంటర్వ్యూకు ఎంపికయ్యే అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.

అరవై శాతం సాధించేలా
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. ఇలా మూడు దశలు కలిపి మొత్తం 1200 మార్కులకు జరిగే ఎంపిక ప్రక్రియలో తుది విజేతలుగా నిలవాలంటే.. 60శాతం మార్కులు సాధించేలా కృషి చేయాల్సి ఉంటుంది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు మెయిన్‌ ఎగ్జామ్‌లో 40 నుంచి 45 శాతం మార్కులు సాధిస్తే.. ఇంటర్వ్యూకు ఎంపికయ్యే అవకాశాలు మెరుగవుతాయి. 


ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్‌ 10, 2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: అక్టోబర్‌ 11 – 17 తేదీల్లో
  • ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 18, 2024
  • మెయిన్‌ ఎగ్జామినేషన్‌ తేదీ: జూన్‌ 22, 2024
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://upsc.gov.in/
Qualification GRADUATE
Last Date October 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories