Skip to main content

UPSC ESE 2024 Notification: కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజనీరింగ్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా‌..

న్యూఢిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)–ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2024 నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. యూపీఎస్సీ దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజనీరింగ్‌ ఉద్యోగాలు భర్తీచే యనుంది.
UPSC ESE 2024 Notification, Apply Now,cEngineering Services Exam 2024

మొత్తం పోస్టుల సంఖ్య: 167
విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్‌ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.01.2024 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ముందుగా పార్ట్‌–1, పార్ట్‌–2 అప్లికేషన్‌ పూర్తిచేయాలి.

చదవండి: SBI Notification 2023: ఏదైనా డిగ్రీ అర్హతతో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఎంపిక విధానం: స్టేజ్‌–1(ప్రిలిమినరీ) ఎగ్జామ్, స్టేజ్‌–2 (మెయిన్‌)ఎగ్జామ్, స్టేజ్‌–3 (పర్సనాలిటీ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.09.2023
దరఖాస్తు సవరణ తేదీలు: 27.09.2023 నుంచి 03.10.2023 వరకు
ప్రిలిమినరీ/స్టేజ్‌–1 పరీక్షతేది: 18.02.2023.

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

Qualification GRADUATE
Last Date October 03,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories