UPSC CGS Exam 2023: 285 జియో సైంటిస్ట్ కొలువులు.. ఎంపిక విధానం ఇలా..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో కేటగిరీ 1, కేటగిరీ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. మంచి హోదాతోపాటు ఆకర్షణీయ వేతనాలను పొందవచ్చు. ఈ నేపథ్యంలో.. కంబైన్డ్ జియో సైంటిస్ట్ నోటిఫికేషన్ వివరాలు, భర్తీ చేసే పోస్టులు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య 285
- కేటగిరీ 1: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్‌లో జియాలజిస్ట్ గ్రూప్-ఏ-216పోస్టులు,జియో ఫిజిస్ట్(గ్రూప్-ఏ)21 పో స్టులు,కెమిస్ట్(గ్రూప్-ఏ)19 పోస్టులున్నాయి.
- కేటగిరీ 2: సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి,డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్, రివర్ డెవలప్‌మెంట్ అండ్ గంగా రెజువెనేషన్‌లో.. సైంటిస్ట్ బి(హైడ్రో జియాలజి) గ్రూప్ ఏ-26 పోస్టులు, సైంటిస్ట్ బి(కెమికల్) గ్రూప్ ఏ-01 పోస్టులు, సైంటిస్ట్ బి(జియోఫిజిక్స్) గ్రూప్ ఏ-02 పోస్టులున్నాయి.
అర్హతలు
- జియాలజీ లేదా అనుబంధ విభాగాల్లో పీజీ కోర్సులు పూర్తిచేసినవారు దరఖాస్తుకు అర్హులు. కెమిస్ట్ పోస్టులకు కెమిస్ట్రీలో పీజీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జియోఫిజిసిస్టు పోస్టులకు ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్‌లో పీజీ చదివిన వారు అర్హులు.
- 01.01.2023 నాటికి కేటగిరి 1 పోస్టులకు గరిష్టంగా 32 ఏళ్లు, కేటగిరి 2 పోస్టులకు 35 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ కేటగిరీలకు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది.
చదవండి: Competitive Exams Preparation Tips: కోచింగ్ లేకుండానే... సివిల్స్, గ్రూప్స్!
ఎంపిక ప్రక్రియ
కంబైన్డ్ జియో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి మూడు దశల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. స్టేజ్-1 ప్రిలిమ్స్, స్టేజ్-2 మెయిన్స్, స్టేజ్-3 ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
స్టేజ్-1
- ప్రిలిమినరీ(స్టేజ్-1) పరీక్షను ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. మొత్తం 400 మార్కులకు స్టేజ్ 1 ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.
- పేపర్-1లో జనరల్ స్టడీస్ 100 మార్కులకు ఉంటుంది. ఈ పేపర్ అభ్యర్థులందరికి ఉమ్మడిగానే నిర్వహిస్తారు.
- పేపర్-2 దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మారుతుంది. పేపర్-2 సంబంధిత సబ్జెక్టులో 300 మార్కులకు ఉంటుంది.
- జియాలజీ, హైడ్రోజియాలజిస్ట్ పోస్టులకు జియాలజీ/హైడ్రోజియాలజీ విభాగం నుంచి ప్రశ్నలు వస్తాయి. జియో ఫిజిసిస్ట్/సైంటిస్ట్ పోస్టులకు జియో ఫిజిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. జియో కెమిస్ట్ పోస్టులకు కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి.
- పేపర్-1, పేపర్-2 ఒక్కో పరీక్ష సమయం 2 గంటలు. రుణాత్మక మార్కులున్నాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి మూడో వంతు కోతను వి«ధిస్తారు.
స్టేజ్-2
ఈ పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో జరుగు తుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. మెయిన్స్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విభాగం నుంచి 3 పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కూ 200 చొప్పున 600 మార్కులకు స్టేజ్-2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం 3 గంటలు.
స్టేజ్-3
చివరి దశ ఇంటర్వ్యూ. దీనికి 200 మార్కులు కేటాయించారు. కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. అభ్యర్థులు సంబంధిత పోస్టులకు తగిన వారా లేదా అనేది గమనిస్తారు. నాయకత్వ లక్షణాలు, ఇతర సామర్థ్యాలను అంచనా వేసి మార్కులు కేటాయిస్తారు.
విధులు.. ఇలా
జియోసైంటిస్ట్‌లు క్షేత్ర అ«ధ్యయనాల ప్రణాళికలను అమలు చేయడం వీరి ప్రాధానమైన విధి. క్షేత్రస్థాయిలో, ప్రయోగశాలల్లో టెక్నీషియన్ల విధులను పర్యవేక్షించడం, ఇతర శాస్త్రవేత్తలతో విధులను సమన్వయ పరచడం వంటివి చేస్తారు. నేలలు, పదార్థాలు, ప్రక్రియల అధ్యయనం చేస్తారు. అలాగే శిలల ఉద్భవించిన తీరు, మార్పులు జరిగిన తీరుతెన్నులను పరిశీలిస్తారు.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 11, 2022
- ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 19, 2023
- వెబ్‌సైట్: https://upsc.gov.in
చదవండి: Civils Preliminary Examination Preparation: ముప్ఫై రోజుల్లో.. మెరిసేలా!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | October 11,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |