Skip to main content

WCD Kadapa Recruitment 2023: వైఎస్సార్‌ జిల్లా, కడప మహిళా–శిశు సంక్షేమ శాఖలో వివిధ ఖాళీలు

వైఎస్సార్‌ జిల్లా, కడప æమహిళా–శిశు సంక్షేమ శాఖ కార్యాలయం.. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన జిల్లా కోఆర్డినేటర్, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Project Assistant Job Application Form, Apply for District Coordinator and Project Assistant Positions, Vacancy Details for WCD Kadapa Recruitment 2023,Contract Basis Employment Opportunity

మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: జిల్లా కోఆర్డినేటర్‌–01, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌–01.
అర్హత
జిల్లా కోఆర్డినేటర్‌: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఐటీ లేదా కంప్యూటర్‌ సైన్స్‌లో çసర్టిఫికేట్‌ లేదా డిప్లొమా ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి . స్థానిక అభ్యర్థులు మాత్రమే అర్హులు. 
ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. మేనేజ్‌మెంట్‌/సోషల్‌ సైన్సెస్‌/న్యూట్రిషన్‌లో పీజీ డిప్లొమా ఉండాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. స్థానిక అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయసు: 25 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

చ‌ద‌వండి: Driver Posts: గుంటూరు జిల్లా జైలులో డ్రైవర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారంతో పాటు అర్హతలకు సంబంధించి అన్ని సర్టిఫికేట్ల జిరాక్స్‌కాపీలను జతచేసి జిల్లా కలెక్టర్‌/జిల్లా మహిళా–శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, కలెక్టరేట్, డి.బ్లాక్, కడప, వైఎస్సార్‌ జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 18.10.2023.

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in/

Qualification GRADUATE
Last Date October 18,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories