TSPSC Faculty Notification 2022: ఫారెస్ట్ కాలేజీలో ప్రొఫెసర్ పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. పలు విభాగాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో నియామకాలు చేపడతారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 29లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 27 (ప్రొఫెసర్-02, అసోసియేట్ ప్రొఫెసర్-04, అసిస్టెంట్ ప్రొఫెసర్-21).
సబ్జెక్టులు: వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్,నేచురల్ రిసో ర్స్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఫారెస్ట్ యుటిలైజేషన్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, ట్రీ బ్రీడింగ్ అండ్ ఇంప్రూవ్‌మెంట్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఆగ్రో ఫారెస్ట్రీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్, ఆగ్రో ఫారెస్ట్రీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, ఫారెస్ట్రీ, ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ బయాలజీ, ఫారెస్ట్ జెనెటిక్ రిసోర్సెస్, వైల్డ్ లైఫ్ సైన్స్.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంసీఏ, ఎంవీఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు టీచింగ్, రీసెర్చ్ అనుభవం ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 21-61ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనాలు: ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 వేతనంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్/రీసెర్చ్ యాక్టివిటీ, అకడమిక్ స్కోర్,టీచింగ్ అనుభవం, రీసెర్చ్ పబ్లికేషన్స్, ఇంటర్వ్యూ కమ్ డెమో తదితర ప్రక్రియల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరి తేదీ: 27.09.2022
- వెబ్‌సైట్: https://www.tspsc.gov.in
చదవండి: TSPSC Recruitment 2022: టీఎస్‌పీఎస్సీలో 833 పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | September 27,2022 |
Experience | 5-10 year |
For more details, | Click here |