TSCAB Recruitment 2022: తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో 40 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
హైదరాబాద్‌లోని తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌సీఏబీ శాఖల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: మేనేజర్(స్కేల్-1)-27, స్టాఫ్ అసిస్టెంట్-13.
అర్హత: 55% మొత్తం మార్కులతో ఏదైనా డిగ్రీ/డిగ్రీ(కామర్స్)ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర స్థానికతతోపాటు తెలుగు భాషలో ప్రావీణ్యం అవసరం.
వయసు: 01.09.2022 నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: మేనేజర్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష(ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్,డిస్క్రిప్టివ్) ఆధారంగా, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుకు ప్రిలిమినరీ పరీక్ష(ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్)ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.10.2022
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ: నవంబర్ 2022
వెబ్‌సైట్: https://tscab.org
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 16,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |