5,089 Teacher Posts: టీఆర్‌టీ సిలబస్‌లో స్వల్పమార్పులు.. ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు..
- టీఎస్‌లో కొనసాగుతున్న ఉపాధ్యాయ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ
- ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు.. 11 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు
మొత్తం పోస్టులు: 5089 (ఎస్‌జీటీ-2,575, స్కూల్ అసిస్టెంట్-1739, లాంగ్వేజ్ పండిట్-611, పీఈటీ-164)
అర్హతలు
- పోస్టులను అనుసరించి ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, డీఎడ్, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
- వయసు: అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయిదేళ్ల వయోసడలింపు లభిస్తుంది. దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
చదవండి: TRT Notification 2023: తెలంగాణలో 5089 టీచర్ పోస్టులు.. ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్..
ఆన్‌లైన్ పరీక్షలు
టీఆర్‌టీ పరీక్షలను ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్-సీబీటీ) విధానంలో మొత్తం 11 రోజులపాటు (నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు) నిర్వహిస్తారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్‌జీటీ) పోస్టులకు ఆరు రోజులపాటు పరీక్షలు ఉంటాయి. అలాగే ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠాలు చెప్పేందుకు అవసరమైన స్కూలు అసిస్టెంట్ (ఎస్‌ఏ) కొలువులకు మూడు రోజుల పాటు పరీక్షలు జరుపుతారు. పీఈటీలు, భాషా పండితులకు ఒక్కో రోజు చొప్పున పరీక్షను నిర్వహిస్తారు. రోజుకు రెండు విడతల చొప్పున ఈ పరీక్షలుంటాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు; అలాగే రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహిస్తారు.
పరీక్ష విధానం
స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ, భాషా పండితులకు నిర్వహించే పరీక్ష 160 ప్రశ్నలకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు పరీక్ష జరుగుతుంది. దీంతోపాటు టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అంటే.. మొత్తం 100 మార్కులకు పరిగణలోకి తీసుకుని తుది ర్యాంకు కేటాయిస్తారు. ఇక పీఈటీ, పీఈడీలకు టెట్ అవసరం లేదు. కాబట్టి వారికి 100 మార్కులకు టీఆర్‌టీ నిర్వహిస్తారు.
చదవండి: DSC SGT Bitbank
ఎస్‌జీటీ
ఈ పోస్టుల అభ్యర్థులకు నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు-10 మార్కులు, పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 20 ప్రశ్నలు-10 మార్కులు, లాంగ్వేజ్-1(ఇండియన్ లాంగ్వేజెస్) 18 ప్రశ్నలు-9 మార్కులు, లాంగ్వేజ్-2(ఇంగ్లిష్) 18 ప్రశ్నలు-9 మార్కులు, మ్యాథమేటిక్స్ 18 ప్రశ్నలు-9 మార్కులు, సైన్స్ 18 ప్రశ్నలు-9 మార్కులు, సోషల్ స్టడీస్18 ప్రశ్నలు-9 మార్కులు, టీచింగ్ మెథడాలజీ(స్ట్రాటజీ పేపర్స్) 30 ప్రశ్నలు-15 మార్కులుంటాయి.
స్కూల్ అసిస్టెంట్
ఈ పోస్టుల అభ్యర్థులకు నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. అవి..జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు-10 మార్కులు, పర్‌స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 20ప్రశ్నలు-10 మార్కులు, సంబంధిత సబ్జెక్టు 88 ప్రశ్నలు-44 మార్కులు, టీచింగ్ మెథడాలజీ 32 ప్రశ్నలు-16 మార్కులకు పరీక్ష ఉంటుంది.
చదవండి: School Assistant Bitbank
మారిన సిలబస్
ఎస్‌జీటీ పోస్టులకు పరీక్ష రాసే వారికి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు; స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసేవారికి 1వ తరగతి నుంచి 10వ తరగతితోపాటు ప్లస్ టూ నుంచి ప్రశ్నలు ఇస్తామని విద్యాశాఖ పేర్కొంది. ఎస్‌జీటీలకు ఇచ్చే ప్రశ్నలు నిర్ణీత తరగతులను దాటి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ప్రశ్నకు అర మార్కు కేటాయిస్తారు. కాబట్టి ప్రతి ప్రశ్నను కీలకంగానే భావించాలి.
పరీక్ష కేంద్రాలు
మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21.10. 2023
- పరీక్ష తేదీలు: 2023నవంబర్ 20నుంచి 30వరకు
- వెబ్‌సైట్ : https://www.schooledu.telangana.gov.in/
Qualification | 12TH |
Last Date | October 21,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |