Paramedical Jobs: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 38 పారామెడికల్ పోస్టులు.. ఎవరు అర్హులంటే
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డాక్టర్ వైఎస్‌ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లు/యూపీహెచ్‌సీల్లో.. ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కాకినాడలోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 38
పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్–03, ఫార్మాసిస్ట్ గ్రేడ్2–07, స్టాఫ్ నర్స్–01, ల్యాబ్ టెక్నీషియన్–11, డేటా ఎంట్రీ ఆపరేటర్–05, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్–11.
వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్, బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా, పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, కాకినాడ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 25.07.2022
వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | July 27,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |