Skip to main content

Telangana Jobs: జోగులాంబ గద్వాల జిల్లాలో 26 ఖాళీలు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

jogulamba gadwal District

జోగులాంబ గద్వాల జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. బస్తీ, పల్లె దవాఖానాల్లో మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ)లుగా పనిచేయడానికి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 26
అర్హత: ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌ అర్హత కలిగిన వైద్యులను పరిగణనలోకి తీసుకుంటారు. 
ఎంబీబీఎస్‌ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. పల్లె దవాఖానాల్లో ఈ పోస్టులో పనిచేయడానికి ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌ వైద్యులు రాకుంటే.. 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్‌ పట్టభద్రులు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్‌ ప్రోగ్రామ్‌ పూర్తిచేసిన వారిని తీసుకుంటారు.
జీతం: ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేసే ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌ వైద్యులకు నెలకు రూ.40 వేలు, ఈ పోస్టులో పనిచేసే స్టాఫ్‌ నర్సులకు నెలకు రూ.29,900 చొప్పున చెల్లిస్తారు.
వయసు: 18 నుంచి 44 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం: ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్, బీఎస్సీ, జీఎన్‌ఎంలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. జిల్లా నియామక కమిటీ నేతృత్వంలో భర్తీ ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు దాఖలుకు తుది గడువుతేది: 17.09.2022
దరఖాస్తు పరిశీలన: 18.09.2022 నుంచి 28.09.2022 వరకు 
అర్హుల జాబితా వెల్లడి: 29.09.2022
అభ్యంతరాల స్వీకరణ తేది: 30.09.2022
ఉద్యోగాలకు ఎంపికైన తుది అర్హుల జాబితా వెల్లడి తేది: 03.10.2022

వెబ్‌సైట్‌: https://gadwal.telangana.gov.in/

చ‌ద‌వండి: TSPSC Notification 2022: మహిళా శిశు సంక్షేమ అధికారి పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 17,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories