Telangana Jobs: ఆదిలాబాద్ జిల్లాలో 53 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఆదిలాబాద్ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. బస్తీ, పల్లె దవాఖానాల్లో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ)లుగా పనిచేయడానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 53
అర్హత: ఎంబీబీఎస్/బీఏఎంఎస్ అర్హత కలిగిన వైద్యులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. పల్లె దవాఖానాల్లో ఈ పోస్టులో పనిచేయడానికి ఎంబీబీఎస్/బీఏఎంఎస్ వైద్యులు రాకుంటే.. 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్/జీఎన్‌ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6నెలల బ్రిడ్జ్ ప్రోగ్రామ్ పూర్తిచేసిన వారిని తీసుకుంటారు.
జీతం: ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేసే ఎంబీబీఎస్/బీఏఎంఎస్ వైద్యులకు నెలకు రూ.40 వేలు, ఈ పోస్టులో పనిచేసే స్టాఫ్ నర్సులకు నెలకు రూ.29,900చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు.
వయసు: 18-44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: ఎంబీబీఎస్/బీఏఎంఎస్, బీఎస్సీ, జీఎన్‌ఎంలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. జిల్లా నియామక కమిటీ నేతృత్వంలో భర్తీ ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో కార్యాలయం,ఆదిలాబాద్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తు దాఖలకు తుది గడువు: 17.09.2022
దరఖాస్తుల పరిశీలన తేది: 18.09.2022 నుంచి 28.09.2022 వరకు
అర్హుల జాబితా వెల్లడి: 29.09.2022
అభ్యంతరాల స్వీకరణ తేది: 30.09.2022
ఉద్యోగాల ఎంపికైన తుది అర్హుల జాబితా వెల్లడి తేది: 03.10.2022
వెబ్‌సైట్: https://adilabad.telangana.gov.in/
చదవండి: Telangana Jobs: మహబూబ్‌నగర్ జిల్లాలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 17,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |