Telangana Jobs: మహబూబ్‌నగర్ జిల్లాలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మహబూబ్‌నగర్ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం..బస్తీ, పల్లె దవాఖానాల్లో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ)లుగా పనిచేయడానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: ఎంబీబీఎస్/బీఏఎంఎస్ అర్హత కలిగిన వైద్యులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. పల్లె దవాఖానాల్లో ఈ పోస్టులో పనిచేయడానికి ఎంబీబీఎస్/బీఏఎంస్ వైద్యులు రాకుంటే 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్/జీఎన్‌ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రామ్ పూర్తిచేసిన వారిని తీసుకుంటారు.
జీతం: ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేసే ఎంబీబీఎస్/బీఏఎంఎస్ వైద్యులకు నెలకు రూ.40,000, ఈ పోస్టులో పనిచేసే స్టాఫ్‌నర్సులకు నెలకు రూ.29,900చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు.
వయసు: 18 నుంచి 44 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: ఎంబీబీఎస్/బీఏఎంఎస్, బీఎస్సీ, జీఎన్‌ఎంలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. జిల్లా నియామక కమిటీ నేతృత్వంలో భర్తీ ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు దాఖలకు తుది గడువు తేది: 17.09.2022
దరఖాస్తుల పరిశీలన తేది: 18.09.2022 నుంచి 28.9.2022 వరకు
అర్హుల జాబితా వెల్లడి: 29.09.2022
అభ్యంతరాల స్వీకరణ తేది: 30.09.2022
ఉద్యోగాలకు ఎంపికైన తుది అర్హుల జాబితా వెల్లడి తేది: 03.10.2022
వెబ్‌సైట్: https://mahabubnagar.telangana.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 17,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |