DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, కర్నూలులో మెడికల్ పోస్టులు.. నెలకు రూ.1.40 లక్షల వరకు వేతనం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం.. మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్ ఎంవో(పీడియాట్రిషన్, ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ)–05, మెడికల్ ఆఫీసర్–01, ఎపిడెమాలజిస్ట్–01, ఓటీ టెక్నీషియన్–05, క్లినికల్ సైకాలజిస్ట్–03, ఆప్టోమెట్రిస్ట్–01, డెంటల్ టెక్నీషియన్–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, ఓటీ టెక్నాలజీ కోర్సు, డెంటల్ టెక్నీషియన్ కోర్సు, బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ, ఎంఏ, పీజీ డిప్లొమా, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.12,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి అకడమిక్ మార్కులు, విద్యార్హత, సాంకేతిక పరీక్షలో సాధించిన మార్కులు, వెయిటేజీ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ఆఫీస్ ఆఫ్ ది డిస్టిట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
వాక్‌ఇన్ తేదీలు: 03.02.2022 నుంచి 09.02.2022 వరకు వాక్‌ఇన్ నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | February 09,2022 |
Experience | 1 year |
For more details, | Click here |