DCHS Recruitment: డీసీహెచ్‌ఎస్, నెల్లూరు జిల్లాలో 126 మెడికల్ పోస్టులు.. నెలకు రూ.28 వేల వరకు వేతనం..
ఆంధ్ర్రçపదేశ్ ప్రభుత్వానికి చెందిన రాష్ట్ర వైద్యారోగ్య,కుటుంబ సంక్షేమ విభాగం.. నెల్లూరు జిల్లాలో ఒప్పంద/అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 126
పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్–03, థియేటర్ అసిస్టెంట్–18, పోస్ట్‌మార్టం అసిస్టెంట్–22, ల్యాబ్ టెక్నీషియన్లు–17, ల్యాబ్ అటెండెంట్–01, ఫిజియోథెరపిస్ట్–02, బయోమెడికల్ ఇంజనీర్లు–03, జనరల్ డ్యూటీ అటెండెంట్లు–51, ప్లంబర్–02, ఎలక్ట్రీషియన్–02, కౌన్సిలర్లు–03, ఆడియోమెట్రీషియన్లు–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బీఏ/బీఎస్సీ/బీకాం, బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్యలో ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.15,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు,అనుభవం, కోర్సు వెయిటేజ్, రూ ల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీసీహెచ్‌ఎస్(ఏపీవీవీపీ), నెల్లూరు జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 24.02.2022
వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | February 24,2022 |
Experience | 1 year |
For more details, | Click here |