Skip to main content

APVVP Recruitment 2022: ఏపీవీవీపీ, వైఎస్సార్‌ కడపలో 93 ఉద్యోగాలు.. నెలకు రూ.52 వేల వ‌ర‌కు వేతనం..

apvvp YSR Kadapa

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ) కమిషనర్‌ కార్యాలయం.. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఒప్పంద/అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 93
పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్లు, ల్యాబ్‌ అటెండెంట్లు, కౌన్సిలర్లు, థియేటర్‌ అసిస్టెంట్, బయోమెడికల్‌ ఇంజనీర్లు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఏపీ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ. 15,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌(ఏపీవీవీపీ), వైఎస్సార్‌ కడప జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 23.02.2022

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in
 

చ‌ద‌వండి: DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, కర్నూలులో 70 స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు.. నెలకు రూ.1.10 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date February 23,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories