Jobs in Andhra Pradesh: ఏపీ వైద్య విధాన పరిషత్, తూర్పు గోదావరి జిల్లాలో 39 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ).. తూర్పు గోదావరి జిల్లాలో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 39
పోస్టుల వివరాలు: థియేటర్ అసిస్టెంట్లు–14, పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్లు–03, ల్యాబ్ అటెండెంట్లు–04, కౌన్సిలర్–01, ఆడియోమెట్రీషియన్లు–03, బయో మెడికల్ ఇంజినీర్లు–04, జనరల్ డ్యూటీ అటెండెంట్–01, ప్లంబర్–04, ఎలక్ట్రీషియన్–03, ల్యాబ్ టెక్నీషియన్–01, ఫిజియోథెరపిస్ట్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్(బయో మెడికల్ ఇంజినీర్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 15,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(ఏపీవీవీపీ), తూర్పు గోదావరి జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 23.03.2022
వెబ్‌సైట్: http://eastgodavari.nic.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 23,2022 |
Experience | 1 year |
For more details, | Click here |