Skip to main content

APVVP Recruitment 2022: ఏపీవీవీపీ, అనంతపురంలో 151 పోస్టులు.. నెలకు రూ.52 వేల వ‌ర‌కు వేతనం..

apvvp Ananthapuramu

ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ)కమిషనర్‌ కార్యాలయం.. అనంతపురం జిల్లాలో ఒప్పంద/అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 151
పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్‌–01, థియేటర్‌ అసిస్టెంట్‌–22, పోస్ట్‌మార్టమ్‌ అసిస్టెంట్‌–30, ల్యాబ్‌ టెక్నీషియన్‌–18, ల్యాబ్‌ అటెండెంట్‌–04, డైటీషియన్‌–01, కౌన్సిలర్‌–07, ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌–03, ఫిజియోథెరపిస్ట్‌–06, బయో–మెడికల్‌ ఇంజనీర్‌–07, జనరల్‌ డ్యూటీ అటెండెంట్స్‌–40, ప్లంబర్‌–06, ఎలక్ట్రీషియన్‌–06.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఏపీ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.15,000 నుంచి రూ.52,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కో–ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌(ఏపీవీవీపీ), గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ క్యాంపస్, అనంతపురం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 23.02.2022

వెబ్‌సైట్‌: http://ananthapuramu.ap.gov.in
​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date February 23,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories