Skip to main content

APVVP Recruitment 2022: ప్రభుత్వాసుపత్రుల్లో 171 పారా మెడికల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

APVVP Anantapur Recruitment

ఉమ్మడి అనంతపురం జిల్లా డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (డీహెచ్‌), ఏపీ వైద్య విధాన పరిషత్‌ (ఏపీవీవీపీ), డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పారామెడికల్, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్యశాఖ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 171 
పోస్టుల వివరాలు: అనెస్తీషియా టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, బయో మెడికల్‌ ఇంజనీర్, కార్డియాలజీ టెక్నీషియన్, క్యాథ్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌2 తదితరాలు.
అర్హత: పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, అనంతపురం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.08.2022

తాత్కాలిక మెరిట్‌ జాబితా విడుదల: 26.08.2022
తుదిఎంపిక జాబితా విడుదల: 29.08.2022
ఎంపికైన అభ్యర్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహణ: 30.08.2022

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in/

చ‌ద‌వండి: AP Model School Recruitment 2022: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 282 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date August 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories