Skip to main content

AP Model School Recruitment 2022: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 282 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

AP Model School Recruitment 2022

ఆంధ్ర ప్రదేశ్ లోని ఆదర్శ పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ).. పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 282
పోస్టుల వివరాలు: పీజీటీ: 211, టీజీటీ 71.
అర్హతలు: పీజీటీ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతోపాటు సంబంధిత సబ్జెక్ట్‌ మెథడాలజీలో బీఈడీ ఉత్తీర్ణత తప్పనిసరి. టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు సంబంధిత మెథడాలజీలో బీఈడీ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తిచేసుకోవాలి. 
వయసు: జన రల్‌ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు. ఎస్సీ/ఎస్టీ/ బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 49 ఏళ్లు.

ఎంపిక విధానం: జోన్, కమ్యూనిటీ రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డిగ్రీ,పీజీకి 60శాతం,బీఈడీకి 10శాతం,గతం లో అతిథి అధ్యాపకులుగా పనిచేసిన వారికి 20శాతం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, టీచింగ్‌ డెమోకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది. 

ముఖ్య సమాచారం 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 17
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://cse.ap.gov.in/DSE/

 

చ‌ద‌వండి: DSNLU Recruitment 2022: డీఎస్‌ఎన్‌ఎల్‌యూ, విశాఖపట్నంలో టీచింగ్, నాన్‌ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date August 17,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories