APPSC Recruitment 2022: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. ఏపీ ఫారెస్ట్ సర్వీస్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 08
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ(అగ్రికల్చర్,బోటనీ,కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (అగ్రికల్చర్ /కెమికల్ /సివిల్ /కంప్యూటర్ /ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్), ఇన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, మ్యాథమేటిక్స్, జువాలజీ.
వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: రూ.48,440 నుంచి రూ.1,37,220 చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
- క్వాలిఫైయింగ్ టెస్ట్, పేపర్–1, పేపర్–2, పేపర్–3, పేపర్–4 పరీక్షల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
- క్వాలిఫైయింగ్ టెస్ట్: ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో జనరల్ ఇంగ్లిష్ 50 మార్కులు, జనరల్ తెలుగు విభాగం నుంచి 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదోతరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 100 నిమిషాలు.
- పేపర్–1: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ.
- పేపర్–2: మ్యాథమెటిక్స్ (పదోతరగతి స్థాయి)
- పేపర్–3: జనరల్ ఫారెస్ట్రీ–1గా ఈ పరీక్షను నిర్వహిస్తారు.
- పేపర్–4: జనరల్ ఫారెస్ట్రీ–2గా నిర్వహిస్తారు.
- పైన పేర్కొన్న నాలుగు పేపర్‌లకు సంబంధించి ఒక్కో పేపర్ 150 ప్రశ్నలకు 150 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం ప్రతి పేపర్‌కు 150 నిమిషాలు.
కంప్యూటర్ ప్రొషిషియన్సీ టెస్ట్
ఈ పరీక్షను 50 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఇందులో ప్రశ్నలు అడుగుతారు. ఎంఎస్ వర్డ్–15, ఎంఎస్ ఎక్స్‌ఎల్–10, ఎంఎస్ పవర్ పాయింట్–10, ఎంఎస్ యాక్సెస్–10, ఇంటర్నెట్‌ల నుంచి 10 మార్కులకు ప్రశ్నలుంటాయి.
ఫీజు చెల్లింపు చివరితేది: 04.12.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.12.2022
వెబ్‌సైట్: https://psc.ap.gov.in
చదవండి: AP High Court Recruitment 2022 : ఏపీ హైకోర్టు 3673 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 05,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |