YSR Aarogyasri Recruitment 2022: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, గుంటూరు జిల్లాలో ఆరోగ్య మిత్ర పోస్టులు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్.. గుంటూరు జిల్లాలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: ఆరోగ్య మిత్ర–20, టీమ్ లీడర్–01, డేటా ఎంట్రీ ఆపరేటర్–01. ఆరోగ్య మిత్ర, 2.
టీమ్‌లీడర్:
అర్హత: బీఎస్సీ(నర్సింగ్)/ఎమ్మెస్సీ(నర్సింగ్) /బీఫార్మసీ/ఎంఫార్మసీ/ఫార్మా డీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
జీతం: ఆరోగ్య మిత్ర పోస్టులకు నెలకు రూ.15,000, టీమ్ లీడర్ పోస్టులకు నెలకు రూ.18,500 చెల్లిస్తారు.
డేటాఎంట్రీ ఆపరేటర్:
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు నుంచి అకడమిక్ రికార్డ్, పీజీడీసీఏ/క్యాడ్/ఇతర కంప్యూటర్ కోర్సు అర్హత ఉండాలి.
జీతం: నెలకు రూ.18,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో మెరిట్ మార్కులు, కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయం, ఏ/26, టైప్–4, ఆర్ అండ్ బీ క్వార్టర్స్, డీఎంహెచ్‌వో కార్యాలయం పక్కన, కలెక్టర్ బంగ్లా రోడ్, గుంటూరు–522004 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 22.06.2022
వెబ్‌సైట్: http://Guntur.ap.gov.in
చదవండి: Asst. Professor Jobs 2022: AP డీఎంఈలో 54 పోస్టులు.. నెలకు రూ.92,000 వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 22,2022 |
Experience | 1 year |
For more details, | Click here |