APSCSCL Recruitment 2023: ఏపీ సివిల్ సప్లైస్, విజయనగరం జిల్లాలో 750 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 750
పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్–250, డేటా ఎంట్రీ ఆపరేటర్–250, హెల్పర్–250.
అర్హతలు
టెక్నికల్ అసిస్టెంట్: బీఎస్సీ (అగ్రికల్చర్/మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/బీఎస్సీ(బీజెడ్‌సీ)/బీఎస్సీ(లైఫ్ సైన్సెస్)/డిప్లొమా(అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
హెల్పర్: ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: టీఏ/డీఈవో పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు, హెల్పర్‌కు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు (టీఏ/డీఈవో పోస్టులకు)
ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, దాసన్నపేట, రింగ్ రోడ్డు, విజయనగరం, విజయనగరం జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 12.09.2023.
వెబ్‌సైట్: https://vizianagaram.ap.gov.in/
చదవండి: SBI Recruitment 2023: ఎస్‌బీఐలో 6160 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
Qualification | Others |
Last Date | September 12,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |