SBI Recruitment 2023: ఎస్‌బీఐలో 6160 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
Sakshi Education
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ –ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్.. అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 6160
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్–390, తెలంగాణ–125.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ/సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
వయసు: 01.08.2023 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.15,000.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, స్థానిక భాష పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 21.09.2023
- ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: అక్టోబర్/నవంబర్ 2023
- వెబ్‌సైట్: https://sbi.co.in/
Qualification | GRADUATE |
Last Date | September 21,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |