TN Income Tax Recruitment 2023: ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం, చెన్నైలో 72 పోస్టులు
Sakshi Education
చెన్నైలోని ఇన్‌కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కార్యాలయం.. స్పోర్ట్స్ పర్సన్స్ కేటగిరీలో భాగంగా వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 72
పోస్టుల వివరాలు: ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్.
అర్హత
ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్: ఏదైనా డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. వేతనం: నెలకు రూ.34,800 చెల్లిస్తారు.
ట్యాక్స్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ/తత్సమాన ఉత్తీ ర్ణులవ్వాలి. వయసు: 18నుంచి 27 ఏళ్లు ఉండాలి. వేతనం: నెలకు రూ.20,200 చెల్లిస్తారు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. వేతనం: నెలకు రూ.20,200 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.02.2023.
వెబ్‌సైట్: tnincometax.gov.in
Qualification | GRADUATE |
Last Date | February 06,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |