Skip to main content

SSC Recruitment 2022: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో స్టెనోగ్రాఫర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

SSC Recruitment

న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) వివిధ మంత్రిత్వ శాఖల్లో/విభాగాల్లో/సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌సి(గ్రూప్‌ బి, నాన్‌ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ డి(గ్రూప్‌ సి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ డి పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు.

పోస్టులు: స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌సి (గ్రూప్‌బి, నాన్‌ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌డి (గ్రూప్‌సి)
అర్హత: ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
వయసు: 01.01.2022 నాటికి స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి పోస్టులకు 1830 ఏళ్లు, గ్రేడ్‌ డి పోస్టులకు 1827 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 05.09.2022
చలానా ద్వారా చెల్లింపు చివరితేది: 06.09.2022

వెబ్‌సైట్‌: https://ssc.nic.in

చ‌ద‌వండి: SSC JE Recruitment 2022: కేంద్రంలో జూనియర్‌ ఇంజనీర్‌ కొలువు.. పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ టిప్స్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date September 06,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories