SSC MTS Jobs: 3603 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు ఇవే.. పరీక్షా విధానం ఇలా..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ).. మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవల్దార్(సీబీఐసీ అండ్ సీబీఎన్) పోస్టులకు పరీక్షను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్–టెక్నికల్)–ఖాళీల వివరాలు తర్వాత వెల్లడిస్తారు.
హవల్దార్(సీబీఐసీ అండ్ సీబీఎన్)–3603.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్(పదో తరగతి) పరీక్ష/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: వివిధ విభాగాలను అనుసరించి 01.01.2022 నాటికి 18–25 ఏళ్లు, 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష (పేపర్–1, పేపర్–2), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ)/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ) ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1 ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పేపర్–2 డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్టులు ఉంటాయి. పరీక్షా సమయం 90 నిమిషాలు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
పేపర్–2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఇది 50 మార్కులకు ఉంటుంది.షార్ట్ ఎస్సే/లెటర్ ఇన్ ఇంగ్లిష్ రాయాల్సి ఉంటుంది. పరీక్షా సమయం 45 నిమిషాలు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.04.2022
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్(టైర్–1): జూలై 2022
టైర్–2 (డిస్క్రిప్టివ్ పేపర్): తేది వెల్లడించాల్సి ఉంది.
వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in
చదవండి: SSC Exams Guidance
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | April 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |