Skip to main content

2065 SSC Jobs: కేంద్ర కొలువు పట్టేలా..!

ssc jobs 2022 notification
  • జాతీయ స్థాయిలో 2065 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌
  • టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతగా పలు స్థాయిల్లో పోస్ట్‌లు
  • మల్టీ టాస్కింగ్, గ్రూప్‌–సి, డి హోదాల్లో ఖాళీలు
  • రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌లో మెరిట్‌ ఆధారంగా ఎంపిక

కేంద్ర ప్రభుత్వ కొలువులు.. పదో తరగతి మొదలు డిగ్రీ వరకు..ప్రతి ఒక్కరి లక్ష్యం! తమ అర్హతలకు తగ్గ పోస్ట్‌ల కోసం..అన్వేషణ సాగిస్తున్న యువత! ఆయా నియామక సంస్థలు ప్రకటనల కోసం ఎదురు చూపులు!! ఇలాంటివారికి.. దేశంలోని అతిపెద్ద నియామక సంస్థ.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) తీపికబురు అందించింది. పదోతరగతి నుంచి డిగ్రీ వరకు.. వివిధ అర్హతలతో మల్టీ టాస్కింగ్, గ్రూప్‌–డి, సి ఆపై హోదాల్లో.. ఫేజ్‌–10/2022 సెలక్షన్‌ ప్రాసెస్‌ పేరిట 2065 పోస్ట్‌ల భర్తీకి శ్రీకారం చుట్టింది! దీనికి సంబంధించి.. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో..ఎస్‌ఎస్‌సీ తాజా నోటిఫికేషన్‌ వివరాలు.. అర్హతలు, ఎంపిక విధానం, విజయానికి మార్గాలపై ప్రత్యేక కథనం... 
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్‌ డిగ్రీ లేదా ఆపై కోర్సులు అర్హతగా తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ రకాల పోస్టులకు సంబంధించి 2065 ఖాళీలను భర్తీ చేయనుంది. రీజియన్ల వారీగానూ ఖాళీలను పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉండే సదరన్‌ రీజియన్‌లో 318 ఖాళీలు ఉన్నాయి. 

835 Head Constable Jobs: ఢిల్లీ పోలీస్‌ శాఖలో కొలువు.. విజయం సాధించడానికి మార్గాలు..

మొత్తం ఖాళీల సంఖ్య: 2065

  • బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో 818 ఉద్యోగాలు
  • ఇంటర్మీడియెట్‌ అర్హతగా 656 ఖాళీలు
  • పదో తరగతి అర్హతగా 591 పోస్టులు

అర్హతలు

  • పోస్ట్‌ స్థాయిని బట్టి పదో తరగతి, ఇంటర్మీడియెట్, బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
  • జూన్‌ 13 నాటికి ఆయా అర్హతలు పొందే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • వయసు: పోస్ట్‌ను అనుసరించి కనీస వయసు 18ఏళ్లు, గరిష్ట వయసు 30ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌

  • అన్ని పోస్ట్‌లకు తొలి దశలో ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో సాధించిన మార్కులు, నిర్దిష్ట కటాఫ్‌ నిబంధనలను అనుసరించి మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. 
  • ఈ మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో టైపింగ్,డేటాఎంట్రీ, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ విభాగాల్లో స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. 

నాలుగు విభాగాలు.. 200 మార్కులు

  • తొలి దశగా నిర్వహించే రాత పరీక్ష నాలుగు విభాగాల్లో 200 మార్కులకు జరుగుతుంది. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 25 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు–50 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 25ప్రశ్నలు–50 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పదో తరగతి,ఇంటర్మీడియెట్, డిగ్రీ అర్హతగా పేర్కొన్న అన్ని పోస్ట్‌లకు ఈ విభాగాల్లో, ఇదే విధానంలో పరీక్ష ఉంటుంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు.
  • పరీక్షకు కేటాయించిన సమయం ఒక గంట. నెగిటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది.ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కు కోత విధిస్తారు. 

క్లిష్టత స్థాయి

రాత పరీక్షలో పేర్కొన్న విభాగాలు, అంశాలు అన్ని పోస్ట్‌లలోనూ ఉమ్మడిగా ఉన్నప్పటికీ.. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌కు పేర్కొన్న అర్హత స్థాయిని బట్టి ప్రశ్నల క్లిష్టత స్థాయి ఉంటుంది. పదో తరగతి అర్హత పోస్ట్‌లకు, ఇంటర్‌ అర్హత పోస్ట్‌లకు, డిగ్రీ అర్హత పోస్ట్‌లకు వేర్వేరు ప్రశ్నలు ఎదురవుతాయి.

మరో నోటిఫికేషన్‌గా

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నియామకాలు అనగానే అభ్యర్థులకు కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్, కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్స్‌ గుర్తొస్తాయి. ఈ రెండింటికీ అదనంగా.. ఫేజ్‌–10 సెలక్షన్‌ ప్రాసెస్‌ను ప్రారంభించడం.. ఆయా శాఖలకు సంబంధించి 2065 పోస్ట్‌లతో మల్టీ టాస్కింగ్, గ్రూప్‌–డి, సి స్థాయి ఉద్యోగాలన్నిం టికీ కలిపి ఉమ్మడి నోటిఫికేషన్‌ ఇవ్వడం ఉద్యోగార్థులకు మరో చక్కటి అవకాశంగా పేర్కొనొచ్చు.

SSC Recruitment 2022: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 1920 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ప్రిపరేషన్‌.. ఇలా

అభ్యర్థులు సిలబస్‌ను పరిశీలిస్తూ తమ ప్రిపరేషన్‌ను సాగించాలి. విద్యార్హత స్థాయికి పేర్కొన్న సిలబస్‌ను పరిశీలించాలి. దాని ఆధారంగా ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి.

రివిజన్, మాక్‌ టెస్ట్‌లు

అభ్యర్థులు ప్రిపరేషన్‌తోపాటు పునశ్చరణ కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక టాపిక్‌ లేదా యూనిట్‌ ప్రిపరేషన్‌ పూర్తయ్యాక నమూనా పరీక్షలు, మాక్‌ టెస్ట్‌లకు హాజరవ్వాలి. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో రాణించేందుకు అర్థమెటిక్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ఇందుకోసం పదో తరగతి స్థాయిలోని గణిత పుస్తకాలతో తమ ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. వాటిద్వారా ముందుగా కాన్సెప్ట్‌లపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్‌ దృక్పథంతో ప్రాక్టీస్‌ చేయాలి. ఫలితంగా ఆయా అంశాలపై పట్టు లభిస్తుంది.

జనరల్‌ ఇంటెలిజెన్స్‌

ఈ విభాగంలో గుర్తులు, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, రిలేషన్‌ షిప్, క్లాసిఫికేషన్, నంబర్‌ సిరీస్, సిమాటిక్‌ అనాలజీ,ఫిగరల్‌ అనాలజీ,వెన్‌ డయాగ్రమ్స్, డ్రాయింగ్‌ ఇన్ఫరెన్సెస్‌ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌

దీనికి సంబంధించి జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్‌ అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ముఖ్యాంశాలపై దృష్టిపెట్టాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

ఈ విభాగంలో రాణించేందుకు అర్థమెటిక్‌తోపాటు ప్యూర్‌ మ్యాథ్స్‌ అంశాలపై పట్టుసాధించాలి. నంబర్‌ సిస్టమ్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్, రేషియోస్, అల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, లీనియర్‌ ఈక్వేషన్స్, టాంజెంట్స్‌ వంటి ప్యూర్‌ మ్యాథ్స్‌ అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

ఈ విభాగానికి సంబంధించి వ్యాకరణంపై పట్టు సాధించాలి. పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌ మొదలు ప్యాసేజ్‌ కాంప్రహెన్షన్‌ వరకూ.. అన్ని రకాల గ్రామర్‌ అంశాలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా యాక్టివ్‌ అండ్‌ పాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్, సినానిమ్స్, యాంటానిమ్స్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్‌లపై పట్టు సాధించాలి.

ఎస్‌ఎస్‌సీ ఫేజ్‌–10 (2022)–ముఖ్యాంశాలు

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 13, 2022
  • దరఖాస్తుల సవరణకు అవకాశం: జూన్‌ 20 నుంచి జూన్‌ 24 వరకు
  • పరీక్ష తేది: ఆగస్ట్‌ నెలలో ఉంటుంది.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.nic.in


లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date June 13,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories