SSC Recruitment: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ ఎగ్జామ్ 2021కు నోటిఫికేషన్ విడుదల.. ఎంపిక విధానం ఇలా..
భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ).. 2021 సంవత్సరానికి గాను కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్, 2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు
- లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్
- సెక్రటేరియట్ అసిస్టెంట్
- పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్
- డేటా ఎంట్రీ ఆపరేటర్
- ఖాళీల వివరాలు తర్వాత వెల్లడిస్తారు.
అర్హతలు
పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్/తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 01.01.2022 నాటికి 18–27ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(టైర్ 1,టైర్ 2), స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్(టైర్ 3) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం:
- టైర్1 పరీక్ష వంద ప్రశ్నలు–200 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్,జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్,హిందీ మాధ్యమంలో ఉంటుంది.
- టైర్ –2 పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో జరుగుతంది. దీన్ని పెన్ అండ్ పేపర్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. టైర్2లో కనీసం 33 శాతం మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేది: 07.03.2022
- టైర్–1 కంప్యూటర్ బేస్డ్ పరీక్ష తేది: మే, 2022లో ఉంటుంది.
- వెబ్‌సైట్: https://ssc.nic.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | March 07,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |