CISF Recruitment: 540 ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. నెలకు రూ.92,300 వరకు వేతనం..
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్).. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి పురుష, మíహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 540
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్): 122(పురుషులు-94,మహిళలు-10, డిపార్ట్‌మెంటల్-18).
హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్): 418 (పురుషులు-319, మహిళలు-36, డిపార్ట్‌మెంటల్-63).
అర్హత: ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్(10+2) సర్టిఫికేట్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎత్తు: పురుష అభ్యర్థులు 165 సెం.మీ, మహిళలు 155 సెం.మీ ఉండాలి. చెస్ట్ 77–82 సెం.మీ మధ్య ఉండాలి. ఎస్టీ సహా కొన్ని రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు ఎత్తు విషయంలో మినహాయింపులు ఉంటాయి.
జీతం: నెలకు ఏఎస్‌ఐ పోస్టులకు రూ.29,200 నుంచి రూ.92,300, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్‌టీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. వీటిలో ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన, వైద్యపరీక్షలు ఉంటాయి.
రాత పరీక్ష ఇలా: ఈ పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 120నిమిషాలు. నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. జనరల్ అభ్యర్థులు 35శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33శాతం కటాఫ్ మార్కులు సాధించాల్సి ఉంటుంది.
నాలుగు విభాగాలు: జనరల్ ఇంటెలిజెన్స్–25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలు 25 మార్కులు, అర్థమెటిక్ –25 ప్రశ్నలు 25 మార్కులు,జనరల్ ఇంగ్లిష్/హిందీల నుంచి 25 మార్కులకు 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.10.2022
వెబ్‌సైట్: https://www.cisfrectt.in/
చదవండి: Competitive Exams: పోటీ పరీక్షలంటే భయం వీడి.. ముందుకు వెళ్లండిలా.. విజయం మీదే..!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | October 25,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |