Skip to main content

Competitive Exams: పోటీ పరీక్షలంటే భయం వీడి.. ముందుకు వెళ్లండిలా.. విజయం మీదే..!

తెలంగాణలో ‘పెద్ద సంఖ్యలో కొలువుల భర్తీ జరగనుండటంతో పోటీ తీవ్రంగా ఉంటుంది. అభ్యర్థుల్లో ఉద్యోగం సాధించాలనే తపనతోపాటు ఆందోళన కూడా ఉంటుంది.
Exam
Overcome Competitive Exam Fear

అయితే, క్రమపద్ధతిలో కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని సన్నద్ధమైతే తప్పకుండా విజయం సాధించవచ్చు’అని శాతవాహన యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.మల్లేశ్‌ చెప్పారు. ప్రభుత్వం 80వేలకుపైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించడంతో నిరుద్యోగులు కొందరు కోచింగ్‌ సెంటర్లకు పరుగులు పెడుతుండగా... మరికొందరు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటూ ఇంటివద్దే ప్రిపేరవుతున్నారు. అయితే.. విజయం సాధించడానికి ఎలాంటి పద్ధతులు అనుసరించాలనే విషయమై అభ్యర్థుల్లో ఆందోళన ఉంటుందని.. దాన్ని వీడి పట్టుదల,ఆత్మ విశ్వాసంతో వెళ్తే తప్పకుండా కొలువును దక్కించుకోవచ్చని మల్లేశ్‌ చెప్పారు. అభ్యర్థులకు సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే...

సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు..

free coaching


అభ్యర్థులు ముందుగా వారి సమయానుకూలతను బట్టి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. పలు ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే నియామక సంస్థలు సిలబస్‌ను ప్రకటించాయి. వాటికి అనుగుణంగా పుస్తకాలను సేకరించి ప్రణాళిక ప్రకారం చదవాలి. అదేవిధంగా సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ను ఎంచుకుని వారి ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవడం,కొత్త విషయాలను తెలుసుకోవడం చేస్తే మంచి ఫలితాలుంటాయి. సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. సమీపంలోని వర్సిటీలో గానీ లేదా వర్సిటీ కాలేజీల్లోని ప్రొఫెసర్లు, నిపుణులను సంప్రదిస్తే సరిపోతుంది.

గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

కోచింగ్‌ సెంటర్ల కన్నా.. ఇదే మేలు
ఉద్యోగ ప్రకటనలు వస్తున్నాయనగానే కోచింగ్‌ సెంటర్లకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. నిజానికి కోచింగ్‌ సెంటర్లకు వెళ్తే వచ్చే ప్రయోజనం కంటే సొంతంగా సన్నద్ధమవడమే మంచిది. స్వీయ సన్నద్ధతతో సమయం కలిసివస్తుంది. వేలల్లో ఫీజులు చెల్లించి వెళ్లే కోచింగ్‌ సెంటర్లలో నిర్దేశించిన సబ్జెక్టు మాత్రమే చెబుతారు. అలాకాకుండా ఇంటి వద్ద ప్రిపరేషన్‌తో ఏకాగ్రత పెంచుకోవడం, సందేహాలను నోట్‌ చేసుకుని వాటిని పరిష్కరించుకోవడం లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.    

రాష్ట్రంలోని ప్రతి యూనివర్సిటీల్లోనే ఉచిత కోచింగ్‌.. 

free coaching


రాష్ట్రంలోని ప్రతి వర్సిటీలో ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే చాలా వర్సిటీల్లో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఇవి విడతలుగా సాగుతాయి. ముందుగా అన్ని ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించే సబ్జెక్టుల బోధన పూర్తి చేస్తాం. ఆ తర్వాత కేటగిరీలుగా తరగతులు నిర్వహిస్తాం. వర్సిటీల్లో శిక్షణపై ఎలాంటి పరిమితులు లేవు. ఎంతమంది అభ్యర్థులు వచి్చనా కాదనకుండా అడ్మిషన్‌ ఇచ్చి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. విశ్వవిద్యాలయాల్లో ఇచ్చే శిక్షణ అత్యుత్తమమని నా అభిప్రాయం. ఎందుకంటే వర్సిటీల్లో అన్ని రకాల సబ్జెక్టులకు నిపుణులు ఉంటారు.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఇలాంటి భయాలు అసలు వద్దు..
ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉన్నవారు ఎలాంటి భయాలు, ఆందోళనలకు తావివ్వొద్దు. భారీగా నియామకాలు చేపడుతుండటంతో పోటీ కూడా అలాగే ఉంటుంది. దరఖాస్తులు వేలల్లో, లక్షల్లో వస్తే వాటి గణాంకాలు చూసి కంగారు పడొద్దు. అందులో సీరియస్‌గా ప్రిపర్‌ అయ్యేవారు కొందరే ఉంటారు. మనం సరిగ్గా ప్రిపేరైతే సరిపోతుంది. జాతీయస్థాయి సమాచారం కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, రాష్ట్రస్థాయి సమాచారం కోసం ఎస్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలి. ప్రధానంగా సిలబస్‌లో నిర్దేశించిన అంశాలను దృష్టిపెట్టి మరింత శ్రద్ధతో సాధన చేయాలి.

ఈ ఏడాది (2022) తెలంగాణ‌లో భ‌ర్తీ చేయ‌నున్న గ్రూప్స్ ఉద్యోగాలు ఇవే..:
➤ గ్రూప్‌-1 పోస్టులు:  503

➤ గ్రూప్‌-2 పోస్టులు : 582

➤ గ్రూప్‌-3 పోస్టులు: 1,373

➤ గ్రూప్‌-4 పోస్టులు : 9,168  

Groups Guidance: మొదటిసారిగా గ్రూప్‌ 2 రాస్తున్నారా? అయితే ఇది మీ కోస‌మే..

Published date : 23 Apr 2022 03:37PM

Photo Stories