Skip to main content

UGC-IUAC Recruitment: యూజీసీ–ఐయూఏసీలో 26 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

UGC–IUAC

యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)కి చెందిన ఇంటర్‌ యూనివర్శిటీ యాక్సిలరేటర్‌ సెంటర్‌(ఐయూఏసీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 26
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ సి–14, ఇంజనీర్లు–07, జూనియర్‌ ఇంజనీర్లు–05.

సైంటిస్ట్‌ సి: 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. మంచి అకడమిక్‌ రికార్డు ఉండాలి.
వయసు: 26 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు చెల్లిస్తారు.

ఇంజనీర్లు:
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. మంచి అకడమిక్‌ రికార్డు, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో ప్రొఫిషియన్సీ.
జీతం: నెలకి రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు చెల్లిస్తారు.

జూనియర్‌ ఇంజనీర్‌: 
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. మంచి అకడమిక్‌ రికార్డుతో పాటు మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్‌/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.03.2022

వెబ్‌సైట్‌: https://www.iuac.res.in/
 

చ‌ద‌వండి: TFRI Recruitment 2022: టీఎఫ్‌ఆర్‌ఐ, జబల్‌పూర్‌లో 42 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

 

Qualification GRADUATE
Last Date March 05,2022
Experience 3 year
For more details, Click here

Photo Stories