NTRO Recruitment 2024: ఎన్‌టీఆర్‌ఓలో 74 సైంటిస్ట్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 74(విభాగాల వారీగా.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్–35, కంప్యూటర్ సైన్స్–33, జియో–ఇన్ఫర్మాటిక్స్ అండ్ రిమోట్‌సెన్సింగ్ –06)
అర్హతలు: పోస్టులను బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్: ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ /అప్లైడ్ ఎలక్ట్రానిక్స్/రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్/మేథమెటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఫస్ట్‌గ్రేడ్ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్‌స్ట్రుమేంటేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ /ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్/టెలికమ్యూనికేషన్స్/కమ్యూనికేషన్ ఆప్టిక్స్‌లో డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, గేట్ స్కోరు కలిగి ఉండాలి.
కంప్యూటర్ సైన్స్: ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు మ్యాథమెటిక్స్ ఫస్ట్‌క్లాస్ మాస్టర్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్/టెక్నాలజీలో ఫస్ట్‌క్లాస్ మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. గేట్ స్కోరు, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.
జియో–ఇన్ఫర్మాటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్: జియో–ఇనఫర్మాటిక్స్/రిమోట్ సెన్సింగ్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ లేదా మ్యాథమెటిక్స్‌లో ఫస్ట్‌క్లాస్ మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, గేట్ స్కోరు ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఎక్స్–సర్వీస్‌మెన్‌కు 5 ఏళ్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక ఇలా
రెండు దశల్లో అర్హత పరీక్షలను నిర్వహిస్తారు. –మొదటిది స్టేజ్–1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), రెండోది స్టేజ్–2 ఇంటర్వ్యూ. ఈ రెండు దశల్లో ప్రతిభ చూపిన వారిని మాత్రమే తుదిగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
స్టేజ్–1 (రాత పరీక్ష): ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా (సీబీటీ) నిర్వహిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలకు 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2మార్కుల చొప్పున కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కు తగ్గిస్తారు.
స్టేజ్–2 (ఇంటర్వ్యూ): ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలో చూపించిన ప్రతిభ ఆధారంగా 1:4 నిష్పత్తిలో ఎంపిక చేసి న్యూఢిల్లీలో ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
ముఖ్యసమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19.01.2024
వెబ్‌సైట్: https://recruit-ndl.nielit.gov.in/
చదవండి: DRDO Recruitment 2024: డీఆర్‌డీవో–సీవీఆర్‌డీఈలో ఐటీఐ అప్రెంటిస్‌లు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 19,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- NTRO Recruitment 2024
- Scientist jobs
- National Technical Research Organisation
- Scientist Jobs at NTRO
- latest notification 2024
- latest job notification 2024
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- ApplicationProcess
- EligibilityCriteria
- JobNotification
- SelectionProcess
- EmploymentOpportunity
- JobOpportunities