Skip to main content

NIPGR Recruitment 2022: ఎన్‌ఐపీజీఆర్, న్యూఢిల్లీలో సైంటిఫిక్, టెక్నికల్ పోస్టులు.. నెలకు రూ.2 లక్ష వ‌ర‌కు వేతనం

NIPGR New Delhi

నూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ జీనోమ్‌ రీసెర్చ్‌(ఎన్‌ఐపీజీఆర్‌).. సైంటిఫిక్, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌లు–05, టెక్నికల్‌ పోస్టులు–04, సెక్షన్‌ ఆఫీసర్‌(అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టు)–01.

సైంటిస్ట్‌లు: 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ(మూడేళ్ల పరిశోధన అనుభవం)/పీహెచ్‌డీ(ఏడాది అనుభవం) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: స్థాయిని అనుసరించి 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: వివిధ స్థాయిలని అనుసరించి నెలకి రూ.56,100 నుంచి రూ.2,16,600 వరకు చెల్లిస్తారు.

టెక్నికల్‌ పోస్టులు: సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్, టెక్నికల్‌ ఆఫీసర్, టెక్నీషియన్లు. 
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, బీఎస్సీ/బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.21,700 నుంచి రూ.1,77,500 వరకు చెల్లిస్తారు.

సెక్షన్‌ ఆఫీసర్‌(అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టు):
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకి రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ప్రాక్టికల్‌ ఎగ్జామినేషన్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.01.2022

వెబ్‌సైట్‌: https://nipgr.ac.in

చ‌ద‌వండి: CSIR-IIIM Recruitment: సీఎస్‌ఐఆర్‌–ఐఐఐఎంలో సైంటిస్ట్‌ పోస్టులు.. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date January 31,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories