Skip to main content

1901 DRDO Jobs 2022: CEPTAM పరీక్ష వివరాలు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు

drdo exam details and preparation tips

ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీటెక్‌ ఉత్తీర్ణులకు.. తీపి కబురు! ఈ అర్హతలతో కేంద్ర కొలువు సొంతం చేసుకోవాలనుకుంటున్న వారికి మంచి అవకాశం!! ప్రారంభంలోనే రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు వేతనం అందుకోవచ్చు. ఇందుకు మార్గం.. డీఆర్‌డీఓ తాజాగా ప్రకటించిన.. సీనియల్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ - బి, టెక్నిషియన్‌-ఎ నియామక ప్రకటనే!! ఈ కొలువు సొంతం చేసుకోవాలంటే.. డీఆర్‌డీఓకు చెందిన సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ ట్యాలెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(సెప్‌ట్యామ్‌).. నిర్వహించే పరీక్షలో విజయం సాధించాల్సి ఉంటుంది! ఈ నేపథ్యంలో.. డీఆర్‌డీఓ కొలువులు, సెప్‌ట్యామ్‌ పరీక్ష వివరాలు, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై విశ్లేషణ... 

  • పలు విభాగాల్లో 1901 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌
  • సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-బి, టెక్నిషియన్‌-ఎ పోస్టులు
  • డీఆర్‌డీఓసెప్టెమ్‌ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ
  • ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌ అర్హతగా ఉద్యోగాలు
  • రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా ఎంపిక
  • సెప్టెంబర్‌ 3 నుంచి 23 వరకు దరఖాస్తు అవకాశం

మొత్తం 1901 ఉద్యోగాలు

  • డీఆర్‌డీఓ తాజా నియామక ప్రకటన ద్వారా సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌బి, టెక్నిషియన్‌-ఎ హోదాల్లో మొత్తం 1901 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది.
  • సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-బి: 1075 ఖాళీలు(వేతన శ్రేణి రూ. 35,400 - 1,12,400)
  • టెక్నిషియన్‌-ఎ హోదాలో 826 ఖాళీలు (వేతన శ్రేణి: రూ. 19,900 - రూ.63,200)

అర్హతలు

  • సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-బి: అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విభాగాలను అనుసరించి బీఎస్సీ, డిప్లొమా, బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.
  • టెక్నిషియన్‌-ఎ: దరఖాస్తు చేసుకున్న విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
  • విద్యార్హతలను సెప్టెంబర్‌ 23, 2022లోపు పొంది ఉండాలి.
  • వయసు: 18ఏళ్ల నుంచి 28ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ వర్గాలకు నిబంధనల ప్రకారం సడలింపు లభిస్తుంది.

చ‌ద‌వండి: DRDO Recruitment: 1901 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

సెప్‌ట్యామ్‌ ఆధ్వర్యంలో ఎంపిక

డీఆర్‌డీఓలో పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ సంస్థకు చెందిన సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ ట్రైనింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(సెప్‌ట్యామ్‌) విభాగం నిర్వహిస్తుంది. డీఆర్‌డీఓలో నాన్‌ గెజిటెడ్‌ హోదాలోని టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, అనుబంధ విభాగాల్లో సిబ్బంది నియామకం, శిక్షణ కోసం ఈ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

రెండు దశల ఎంపిక ప్రక్రియ

  • సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌బి, టెక్నిషియన్‌ఎ పోస్టులకు సంబంధించి టైర్‌-1, టైర్‌-2 పేరుతో రెండు దశల రాత పరీక్ష నిర్వహిస్తారు. 
  • సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌బి, టెక్నిషియన్‌ఎ ఉద్యోగాలకు టైర్‌-1 పరీక్ష స్క్రీనింగ్‌ టెస్ట్‌గా ఉంటుంది.
  • టైర్‌-1 పరీక్షలో నిర్దేశిత కటాఫ్‌ మార్కులతో ఉత్తీర్ణత సాధించి మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి.. 1:8 నిష్పత్తిలో తదుపరి దశలో టైర్‌2 పేరుతో మరో రాత పరీక్ష నిర్వహిస్తారు.
  • సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌బి ఉద్యోగాలకు టైర్‌-2 పరీక్షను సెలక్షన్‌ టెస్ట్‌గా; టెక్నీషియన్‌ఎ ఉద్యోగాలకు టైర్‌-2 పరీక్షను ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్‌గా పేర్కొన్నారు.

ఎస్‌టీఏబి రాత పరీక్షల వివరాలు

  • ఎస్‌టీఏబి టైర్‌-1 పరీక్షలో.. క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ/అప్టిట్యూడ్, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, జనరల్‌ సైన్స్‌ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 120 మార్కులకు120 ప్రశ్నలు అడుగుతారు.
  • టైర్‌-2 పరీక్షను అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విభాగానికి చెందిన సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్నలతో నిర్వహిస్తారు. ఇందులో 100 మార్కులకు 100 ప్రశ్నలు అడుగుతారు.
  • టైర్‌-1 పరీక్షకు అన్ని విభాగాల అభ్యర్థులకు ఉమ్మడిగా నిర్వహిస్తారు.
  • రెండు పరీక్షలు కూడా ఆబ్జెక్టివ్‌ తరహాలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు.

టెక్నిషియన్‌ఎ పరీక్షలు ఇలా

  • టెక్నిషియన్‌ఎ పోస్టులకు సంబంధించి.. టైర్‌-1 రాత పరీక్షను సెక్షన్‌-ఎ, సెక్షన్‌-బి పేరుతో రెండు విభాగాలుగా నిర్వహిస్తారు. 
  • సెక్షన్‌-ఎలో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ/ఆప్టిట్యూడ్, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, జనరల్‌ సైన్స్‌ విభాగాల నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు.
  • సెక్షన్‌-బిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ట్రేడ్‌ లేదా పోస్ట్‌ కోడ్‌కు సంబంధించి సబ్జెక్ట్‌ ప్రశ్నలు మొత్తం 80 అడుగుతారు.
  • ఇలా మొత్తం 120 ప్రశ్నలతో 120 మార్కులకు రెండు విభాగాల్లో టైర్‌-1 పరీక్ష నిర్వహిస్తారు.
  • టైర్‌-2.. ట్రేడ్‌ టెస్ట్‌: టైర్‌-1 టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా 1:8 నిష్పత్తిలో అభ్యర్థులను టైర్‌-2 ట్రేడ్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఈ ట్రేడ్‌ టెస్ట్‌లో ఐటీఐ స్థాయిలో అభ్యర్థులు ఆయా ట్రేడ్‌లలో పొందిన నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రాక్టికల్‌గా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌ వ్యవధి కనిష్టంగా ఒక గంట, గరిష్టంగా రెండు గంటలుగా ఉంటుంది.

సర్టిఫికెట్ల పరిశీలన.. కొలువు ఖరారు

రెండు పోస్ట్‌లకు సంబంధించి రెండు దశల రాత పరీక్షల్లోనూ విజయం సాధించిన అభ్యర్థులు చివరగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలోనూ విజేతలుగా నిలిస్తే.. డీఆర్‌డీఓకు చెందిన లేబొరేటరీలు, అనుబంధ సంస్థలు, విభాగాల్లో నియామకాలు ఖరారు చేస్తూ.. ఆ అభ్యర్థుల జాబితాను డీఆర్‌డీఓ అధికారులకు సెప్‌ట్యామ్‌ విభాగం అందిస్తుంది. 

విజయం సాధించాలంటే
క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ/ఆప్టిట్యూడ్‌

ఈ విభాగంలో రాణించేందుకు అభ్యర్థులు.. ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్‌ చాప్టర్లపై దృష్టి పెట్టాలి. అర్థమెటిక్‌లో రేషియోప్రపోర్షన్, ఇంట్రస్ట్, ప్రాఫిట్‌లాస్, డిస్కౌంట్, పార్టనర్‌షిప్‌ బిజినెస్, మిక్చర్‌ అండ్‌ అలిగేషన్, టైం అండ్‌ వర్క్,టైం అండ్‌ డిస్టెన్స్, పర్సంటేజెస్, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ తదితర అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి. 

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ

ఈ విభాగంలో కొద్దిపాటి కసరత్తుతో మంచి మార్కులు పొందొచ్చు.వెర్బల్,నాన్‌ వెర్బల్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. అనాలజీస్, సిమిలారిటీస్‌ అండ్‌ డిఫరెన్సెస్‌; స్పేస్‌ విజువలైజేషన్, కోడింగ్‌డీకోడింగ్, న్యూమరికల్‌ ఆపరేషన్స్, వెన్‌ డయాగ్రమ్స్‌ తదితర అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌

ఈ విభాగంలో మంచి మార్కులు సొంతం చేసుకోవడానికి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, జనరల్‌ సైన్స్, స్టాండర్డ్‌ జీకే, కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర, ఆధునిక భారత దేశ చరిత్ర, భారత భౌగోళిక స్వరూపం, సహజ వనరులు, పంటలు, వ్యవసాయం అంశాలపై దృష్టి పెట్టాలి. పాలిటీకి సంబంధించి రాజ్యాంగ పీఠిక మొదలు తాజా సవరణల వరకు అన్ని అంశాలు తెలుసుకోవాలి. 

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు.. ముందుగా గ్రామర్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. మొదట గ్రామర్‌ రూల్స్‌ తెలుసుకోవడంతోపాటు వాటి అప్లికేషన్‌ ఆధారిత ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. పుస్తకాలతోపాటు నిత్యం ఇంగ్లిష్‌ పత్రికల్లో వచ్చే ఎడిటోరియల్స్‌ చదువుతూ కొత్త పదాలు నోట్‌ చేసుకోవాలి. రీడింగ్‌ కాంప్రెహెన్షన్‌లో వచ్చే ప్యాసేజీలను అటెంప్ట్‌ చేయడానికి ప్రయత్నించాలి. తద్వారా మంచి స్కోర్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది.

జనరల్‌ సైన్స్‌

జనరల్‌ సైన్స్‌కు సంబంధించి బేసిక్‌ సైన్సెస్‌తోపాటు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగాల్లో ఇటీవలి పరిణామాలు.. ముఖ్యంగా డీఆర్‌డీఓ, ఇస్రో వంటి సంస్థల ప్రయోగాలపై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా హైస్కూల్‌ స్థాయిలోని సైన్స్‌ పుస్తకాల్లోని ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి.

టైర్‌2కు ఇలా

  • అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సబ్జెక్ట్‌లలో నిర్వహించే టైర్‌-2 విషయంలో.. ఎస్‌టీఏబి అభ్యర్థులు తమ సబ్జెక్ట్‌కు సంబంధించి డిగ్రీ, డిప్లొమా, బీటెక్‌ స్థాయిలోని అకడమిక్‌ పుస్తకాలను అధ్యయనం చేయాలి. వాటిలోని అంశాలను కాన్సెప్ట్యువల్‌ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి.
  • టెక్నిషియన్‌ఎ అభ్యర్థులు టైర్‌2లోని ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్‌లో రాణించేందుకు తాము దరఖాస్తు చేసుకున్న విభాగాలకు సంబంధించి ప్రాక్టికల్‌ నైపుణ్యాలు సొంతం చేసుకునేలా సిద్ధమవ్వాలి. సబ్జెక్ట్‌ అంశాలను వాస్తవ పరిస్థితులతో అన్వయం చేస్తూ ప్రాక్టీస్‌ చేయడం, అదే విధంగా తమ కోర్సు సమయంలో చేసిన ప్రాక్టికల్స్‌ను పునరావలోకం చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది.

డీఆర్‌డీఓ జాబ్స్‌ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: సెప్టెంబర్‌ 3 - సెప్టెంబర్‌ 23
  • పరీక్ష తేదీలు: డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం
  • తెలుగు రాష్ట్రాలో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌
  • పూర్తి వివరాలకు,ఆన్‌లైన్‌ దరఖాస్తులకు వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in/ceptm-advertisement/1782, https://ceptam10.com/ceptamvpapr20

చ‌ద‌వండి: IISER Recruitment 2022: ఐఐఎస్‌ఈఆర్, కోల్‌కతాలో సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టులు.. నెలకు రూ.2,15,900 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 23,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories