ASRB Recruitment 2023: 368 సైంటిస్ట్స్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎంపికైతే.. ఉజ్వల భవిష్యత్తు
- ప్రిన్సిపల్ సైంటిస్ట్స్, సీనియర్ సైంటిస్ట్స్ పోస్టులు
- ఏఎస్‌ఆర్‌బీ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ
- ఎంపికైతే.. ఉజ్వల భవిష్యత్తు ఖాయం
అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్.. సంక్షిప్తంగా ఏఎస్‌ఆర్‌బీ. కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ విభాగం ఏర్పాటు చేసిన సంస్థ. భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్), ఇతర వ్యవసాయ, అనుబంధ విభాగాల్లో సైంటిస్ట్ పోస్ట్‌లకు ఎంపిక ప్రక్రియను ఏఎస్‌ఆర్‌బీ చేపడుతుంది. ఈ సంస్థ సైంటిస్ట్ పోస్ట్‌ల భర్తీకి నిరంతరం నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటుంది. తాజాగా ఐసీఏఆర్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న పరిశోధనశాలల్లో సైంటిస్ట్స్ పోస్ట్‌ల భర్తీకి దరఖాస్తు ప్రకియ ప్రారంభించింది.
మొత్తం పోస్టులు 368
తాజా నోటిఫికేషన్ ద్వారా ఏఎస్‌ఆర్‌బీ.. ప్రిన్సిపల్ సైంటిస్ట్స్, సీనియర్ సైంటిస్ట్ హోదాలో మొత్తం 368 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ప్రిన్సిపల్ సైంటిస్ట్ హోదాలో 80 పోస్ట్‌లు, సీనియర్ సైంటిస్ట్ హోదాలో 288 పోస్ట్‌లు ఉన్నాయి.
అగ్రికల్చర్ నుంచి ఎకానమీ వరకు
పలు స్పెషలైజేషన్లలో ప్రిన్సిపల్ సైంటిస్ట్‌లు, సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. అగ్రికల్చర్, అనుబంధ విభాగాలతోపాటు ఎకానమీ, బిజినెస్ పాలసీ, హ్యూమన్ రిసోర్సెస్ వంటి స్పెషలైజేషన్లలోనూ ఈ పోస్ట్‌ల నియామకం చేపట్టనున్నారు.
పీహెచ్‌డీ అర్హతగా
ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ రెండు పోస్ట్‌లకు పీహెచ్‌డీని అర్హతగా నిర్దేశించారు. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకుంటున్న స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. తమ అర్హతలకు సరితూగే అన్ని పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఆయా పోస్ట్‌లకు సంబంధించి ప్రాథమ్యత క్రమాన్ని పేర్కొనాల్సి ఉంటుంది.
అనుభవం తప్పనిసరి
- ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే వారికి పని అనుభవం తప్పనిసరి.
- ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్ట్‌లకు సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ తర్వాత పదేళ్ల అనుభవం ఉండాలి.
- సీనియర్ సైంటిస్ట్ పోస్ట్‌లకు సంబంధిత విభాగంలో ఎనిమిదేళ్ల పని అనుభవం తప్పనిసరి.
- ఈ పని అనుభవం కూడా సైంటిస్ట్, లెక్చరర్, ఎక్ట్స్‌టెన్షన్ స్పెషలిస్ట్ హోదాల్లో పొందాలని పేర్కొన్నారు. అదే విధంగా.. కనీసం ఆరు రీసెర్చ్ జర్నల్స్ కూడా ప్రచురితమై ఉండాలి.
వయసు
- ప్రిన్సిపల్ సైంటిస్ట్‌కు గరిష్టంగా 52 ఏళ్లు, సీనియర్ సైంటిస్ట్‌కు గరిష్టంగా 47 ఏళ్లు ఉండాలి.
వేతన శ్రేణి
- ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్ట్‌లకు వేతన శ్రేణి కూడా భారీగా ఉంటోంది.
- ప్రిన్సిపల్ సైంటిస్ట్స్‌కు వేతన శ్రేణి రూ.1,44,200-రూ.2,18,200, సీనియర్ సైంటిస్ట్‌లకు వేతన శ్రేణి రూ.1,31,400-2,17,100గా పేర్కొన్నారు.
ఇంటర్వ్యూలో ప్రతిభ
ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్ట్‌లకు పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా నియామకాలు ఖరారు చేస్తారు. ఆయా స్పెషలైజేషన్లలో వచ్చిన దరఖాస్తులు, పోస్ట్‌ల సంఖ్య, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ జాబితాలో నిలిచిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ దశలో నిపుణుల కమిటీ అభ్యర్థులకు సైంటిస్ట్‌గా కొనసాగేందుకు ఉన్న ఆసక్తిని,వ్యక్తిగత సామర్థ్యాలను పరిశీలిస్తారు. ఇందులోనూ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులతో మెరిట్ జాబితా రూపొందించి పోస్ట్‌లు, రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని తుది నియామకాలు ఖరారు చేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 8, 2023
- ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://www.asrb.org.in/notice-board
చదవండి: ASRB Recruitment 2023: ఏఎస్‌ఆర్‌బీలో 368 సైంటిస్ట్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | PhD |
Last Date | September 08,2023 |
Experience | 5-10 year |
For more details, | Click here |