Trade Apprentice Vacancies: ఎన్‌పీసీఐఎల్‌లో 107 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు
రాజస్థాన్‌లోని రావత్‌భటాలో ఉన్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఐఎల్).. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 107
ఖాళీల వివరాలు: ఫిట్టర్–30, టర్నర్–04, మెషినిస్ట్–04, ఎలక్ట్రీషియన్–30, ఎలక్ట్రానిక్ మెకానిక్–30, వెల్డర్–04, కోపా(కంప్యూటర్ ఆపరేటర్ కమ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్)–05.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ఆరోగ్యంగా ఉండాలి.
వయసు: 13.09.2021 నాటికి 14ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.
స్టయిపెండ్: ఏడాది ఐటీఐ కోర్సు చేసినవారికి నెలకు రూ.7700, రెండేళ్ల ఐటీఐ కోర్సు చేసినవారికి రూ.8855 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును హెచ్‌ఆర్ ఆఫీసర్, న్యూక్లియర్ ట్రెయినింగ్ సెంటర్, రావత్‌భటా సైట్, కోటా, రాజస్థాన్–323303 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 27.09.2021
వెబ్‌సైట్: www.npcilcareers.co.in
Qualification | DIPLOMA |
Last Date | September 13,2021 |
Experience | Fresher job |