Skip to main content

UGC-NET Exam Schedule: యూజీసీలో జేఆర్‌ఎఫ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ).. నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ డిసెంబర్‌ 2022 (యూజీసీ–నెట్‌) పరీక్ష షెడ్యూల్‌ విడుదల చేసింది. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు.
UGC NET 2022 Notification

సబ్జెక్టులు: అడల్డ్‌ ఎడ్యుకేషన్, ఆంత్రోపాలజీ, అరబ్‌ కల్చర్‌ అండ్‌ ఇస్లామిక్‌ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్‌ సైన్స్, క్రిమినాలజీ తదితరాలు.
అర్హత: 55శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జేఆర్‌ఎఫ్‌కు 01.02.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు గరిష్ట వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆ«ధారిత పరీక్ష(సీబీటీ)విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలోనూ ఆబ్జెక్టివ్‌ టైప్,మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌–1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌–2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.01.2023.
పరీక్ష తేదీలు: 21.02.2023 నుంచి 10.03.2023 వరకు.

వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in/

చ‌ద‌వండి: Non-Teaching Jobs: ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నాన్‌టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 17,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories