SEBI Recruitment 2022: సెబీ, ముంబైలో 120 ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెక్యూరిటీస్ అండ్ ఎక్సే ్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ).. వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్ ఏ(అసిస్టెంట్ మేనేజర్లు) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 120
పోస్టుల వివరాలు: జనరల్–80, లీగల్–16, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)–14, రీసెర్చ్–07, అఫీషియల్ లాంగ్వేజ్–03.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.12.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: మూడు దశల్లో జరుగుతుంది. మొదటిగా ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఫేజ్ 1 స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఫేజ్ 2 ఆన్‌లైన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఫేజ్ 2 ఆన్‌లైన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. దీనిలో ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎంపికచేస్తారు. ఫేజ్ 2లో సాధించిన స్కోర్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.01.2022
వెబ్‌సైట్: https://www.sebi.gov.in/
చదవండి: MOFPI Recruitment: ఎంఓఎఫ్‌పీఐలో కన్సల్టెంట్స్, యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 24,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |