Wildlife Institute of India Recruitment: డబ్ల్యూఐఐలో 98 ప్రాజెక్ట్ పర్సనల్ పోస్టులు.. నెలకు రూ.42 వేల వరకు వేతనం
డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఐఐ).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ పర్సనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 98
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, వెటర్నరీ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెయినింగ్ కోఆర్డినేటర్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 20,000 నుంచి రూ.42,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ ద్వారా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసినవారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, పోస్ట్ ఆఫీస్ –మొహిబీవాలా, డెహ్రాడూన్, 248002, ఉత్తరాఖండ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 25.01.2022
వెబ్‌సైట్: https://www.wii.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 25,2022 |
Experience | 1 year |
For more details, | Click here |