Skip to main content

Andhra Pradesh సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో 37 ఉద్యోగాలు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్ట్‌ కార్యాలయంలో.. అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AP Comprehensive Punishment State Office 37 Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 37
పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్‌–13, డేటాఎంట్రీ ఆపరేటర్లు–10, ఆఫీస్‌ సబార్డినేట్‌–14.
జూనియర్‌ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్లు: అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, టైపింగ్‌ స్కిల్స్, ఎంఎస్‌ ఆఫీస్‌/పీజీడీసీఏ/డీసీఏ/ఇంజనీరింగ్‌ సర్టిఫికేట్‌/కంప్యూటర్‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణుౖలñ  ఉండాలి.
ఆఫీస్‌ సబార్డినేట్‌: అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్‌ భాషలు చదవడం, రాయండం తెలిసి ఉండాలి.
వయసు: 30.11.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మ«ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.23,500, డేటాఎంట్రీ ఆపరేటర్‌కు రూ.23,500, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులకు రూ.15,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: జేఏ, డీఈవో ఖాళీలకు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కులు, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులకు పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.01.2023.
స్కిల్‌టెస్ట్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాల వెల్లడి తేది: 03.02.2023.
ధ్రువపత్రాల పరిశీలన తేది: 06.02.2023, 07.02.2023.
స్కిల్‌ టెస్ట్‌ తేది: 11.02.2023, 12.02.2023.
ఎంపిక జాబితా వెల్లడి తేది: 13.02.2023.
వెబ్‌సైట్‌: apssa.aptonline.in

Also read: Western Coalfields Ltd Recruitment 2023 : వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్, నాగ్‌పూర్‌లో 135 మైనింగ్‌ సిర్దార్, సర్వేయర్‌ పోస్టులు

Qualification GRADUATE
Last Date January 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories