Skip to main content

Airport Authority of India Recruitment 2023: 342 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అ«థారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ).. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AAI Recruitment 2023 Notification Out for 342 junior executive posts

మొత్తం పోస్టుల సంఖ్య: 342
పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్‌(ఆఫీస్‌)–09, సీనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌)–09, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(కామన్‌ కేడర్‌)–237, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఫైనాన్స్‌)–66, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఫైర్‌ సర్వీసెస్‌)–03, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(లా)–18.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, ఐసీడబ్ల్యూఏ, సీఏ, ఎంబీఏ, బీఈ, బీటెక్, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతోపాటు లైట్‌ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.
వయసు: 04.09.2023 నాటికి సీనియర్‌/
జూనియర్‌ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌కు 27 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్‌: నెలకు జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌కు రూ.40,000 నుంచి రూ.1,40,000, సీనియర్‌ అసిస్టెంట్‌కు రూ.36,000 నుంచి రూ.1,10,000, జూనియర్‌ అసిస్టెంట్‌కు రూ.31,000 నుంచి రూ.92,000.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్, ఫిజికల్‌ మెజర్‌మెంట్, ఎండ్యూరెన్స్‌ టెస్ట్, డ్రైవింగ్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష విధానం
ఈ పరీక్షను రెండు పార్ట్‌లుగా 120 మార్కులకు నిర్వహిస్తారు. నెగిటివ్‌ మార్కులు ఉండవు.

  • పార్ట్‌–ఎ: ఈ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఇంగ్లిష్‌ 20 ప్రశ్నలు–20 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌/రీజనింగ్‌–15 ప్రశ్నలు–15 మార్కు­లు, జనరల్‌ ఆప్టిట్యూడ్‌/న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌–15 ప్రశ్నలు–15 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌/జనరల్‌ అవేర్‌నెస్‌ 10 ప్రశ్నలు–10 మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • పార్ట్‌–బి: ఈ పరీక్షలో రెండు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.ఇందులో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్‌ విభాగాల నుంచి 60 ప్రశ్నలకు–60 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండు పార్ట్‌లకు కలిపి పరీక్ష సమయం 120 నిమిషాలు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 05.08.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.09.2023

వెబ్‌సైట్‌: https://www.aai.aero/

చ‌ద‌వండి: SSC CPO Notification 2023: 1876 ఎస్‌ఐ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 04,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories