Skip to main content

AIIMS Recruitment: ఎయిమ్స్, బీబీనగర్‌లో జూనియర్‌, సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

AIIMS Bibinagar

తెలంగాణ(బీబీ నగర్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 63
పోస్టుల వివరాలు: సీనియర్‌ రెసిడెంట్లు(నాన్‌ అకడమిక్‌)–38, జూనియర్‌ రెసిడెంట్లు(నాన్‌ అకడమిక్‌)–25.

సీనియర్‌ రెసిడెంట్లు: 
విభాగాలు: జనరల్‌ మెడిసిన్‌ అండ్‌ అనెస్తీషియా, పీడియాట్రిక్స్, బయోకెమిస్ట్రీ అండ్‌ మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ అండ్‌ రేడియాలజీ, ఆప్తల్మాలజీ అండ్‌ ఆర్థోపెడిక్స్‌ తదితరాలు. 
అర్హత: పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌/డీఎం/ఎంసీహెచ్‌/డీఎన్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 45ఏళ్లు మించకుండా ఉండాలి.

జూనియర్‌ రెసిడెంట్లు (నాన్‌ అకడమిక్‌): 
అర్హత: ఎంబీబీఎస్‌/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. ఎంసీఐ/రాష్ట్రంలో రిజిస్టర్‌ అయి ఉండాలి. 
వయసు: 37ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: దరఖాస్తులు పోస్టులకంటే మూడు రెట్లు ఎక్కువగా వస్తే రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ తక్కువ దరఖాస్తులు వస్తే అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 09.11.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://aiimsbibinagar.edu.in/

చ‌ద‌వండి: 
AIIMS Recruitment: ఎయిమ్స్, పాట్నాలో 158 ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

Andhra Pradesh Jobs: ఏపీలో 3393 పోస్టులు.. అర్హతలు ఇవే

Qualification POST GRADUATE
Last Date November 09,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories