JIPMER Recruitment 2022: 433 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు.. రాత పరీక్ష ఇలా..
- జిప్‌మర్‌లో 433 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- ఎంపికైతే నెలకు రూ.45వేల వరకూ వేతనం
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మర్)..నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ.45వేల వరకు వేతనంగా లభిస్తుంది. 80శాతం పోస్టులను మహిళా అభ్యర్థులకు కేటాయించారు. ఆసక్తి, అర్హత గల వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
చదవండి: AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1458 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 433
పోస్టులు: నర్సింగ్ ఆఫీసర్
అర్హతలు
బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ(పోస్ట్-సర్టిఫికేట్) లేదా పోస్ట్ బేసిక్ నర్సింగ్. లేదా డిప్లొమా(జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ)తోపాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
రాత పరీక్ష ఇలా
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)లో 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. ఇలా మొత్తం 400 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. ఇందులో ప్రొఫెషనల్, జనరల్ అవేర్‌నెస్, లాంగ్వేజ్, మ్యాథమెటికల్ ప్రొఫిషియన్సీ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 70శాతం వెయిటేజీ సబ్జెక్టు నాలెడ్జ్ నుంచి, అలాగే 30శాతం జనరల్ అవేర్‌నెస్(జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ మ్యాథమెటిక్స్) నుంచి అడుగుతారు.
- స్టేజ్-2: ఈ దశలో దరఖాస్తు చేసుకున్న పోస్టుకు సంబంధించి స్కిల్ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
కనీస అర్హత మార్కులు
సీబీటీ పరీక్షకు సంబంధించి జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులు సాధించాలి. ఎస్టీ/ఎస్టీ/ఓబీసీ వారు 40శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. అన్ని కేటగిరీల అభ్యర్థులు ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్‌లో 50 శాతం కనీస మార్కులుగా సాధించాలి.
వేతనాలు: 7వ పే స్కేల్‌కు అనుగుణంగా ప్రతి నెల రూ.44,900 వరకు వేతనం అందుతుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 01.12.2022
- పరీక్ష తేదీ: 18.12.2022
- వెబ్‌సైట్: https://jipmer.edu.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 01,2022 |
Experience | 2 year |
For more details, | Click here |