Skip to main content

AIIMS Recruitment 2023: 3055 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్‌ ఇదే..

నర్సింగ్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు దేశంలోని ప్రముఖ వైద్యసంస్థలైన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)ల్లో సువర్ణ అవకాశం. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 3055 నర్సింగ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం కోర్సులు పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు ఉంటాయి. ఎయిమ్స్‌ల్లో నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల వివరాలు..
AIIMS Nursing Officer Syllabus & Exam Pattern 2023

మొత్తం పోస్టుల: నర్సింగ్‌ ఆఫీసర్‌ 3055
సంస్థల వారీగా ఖాళీల వివరాలు
ఎయిమ్స్‌ భటిండా-142, ఎయిమ్స్‌ భోపాల్‌-51, ఎయిమ్స్‌ భువనేశ్వర్‌-169, ఎయిమ్స్‌ బీబీనగర్‌-150, ఎయిమ్స్‌ బిలాస్‌పూర్‌-178, ఎయిమ్స్‌ దేవ్‌ఘర్‌-100, ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్‌-121, ఎయిమ్స్‌ జోద్‌పూర్‌-300, ఎయిమ్స్‌ కల్యాణి-24, ఎయిమ్స్‌ మంగళగిరి-117, ఎయిమ్స్‌ నాగ్‌పూర్‌-87, ఎయిమ్స్‌ రాయ్‌ బరేలీ-77, ఎయిమ్స్‌ న్యూఢిల్లీ-620, ఎయిమ్స్‌ పట్నా-200, ఎయిమ్స్‌ రాయ్‌పూర్‌-150, ఎయిమ్స్‌ రాజ్‌కోట్‌-100, ఎయిమ్స్‌ రిషికేష్‌-289, ఎయిమ్స్‌ విజయ్‌పూర్‌-180.

అర్హత
డిప్లొమా(జీఎన్‌ఎం)తోపాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ(ఆనర్స్‌) నర్సింగ్‌ /బీఎస్సీ నర్సింగ్‌/బీఎస్సీ(పోస్ట్‌ సర్టిఫికేట్‌)/పోస్ట్‌-బేసిక్‌ నర్సింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్‌/ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.

వయసు
వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు అయిదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

చ‌ద‌వండి: UPSC CMS Preparation Tips: కేంద్రంలో 1261 పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, పరీక్షలో విజయానికి మార్గాలు..

వేతనం
నర్సింగ్‌ ఆఫీసర్‌ కొలువుకు ఎంపికైన వారికి పేస్కే­ల్‌ లెవల్‌ 7 ప్రకారం-వేతనాలు చెల్లిస్తారు. వీరు ప్రతి నెల రూ.44,900 మూల వేతనంగా పొందుతారు.దీనికి డీఏ,హెచ్‌ఆర్‌ఏ అదనంగా ఉంటాయి.

ఎంపిక ఇలా
నర్సింగ్‌ ఆఫీసర్స్‌ రిక్రూట్‌మెంట్‌ కామన్‌ ఎలిజిబిలిటీ టెస్టు(ఎన్‌ఓఆర్‌సెట్‌)లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో సాధించిన స్కోరు ఆరు నెలలు లేదా తర్వాత పరీక్ష వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ వ్యవధిలో కొత్తగా ఖాళీలు ఏర్పడితే ఈ స్కోరు ఆధారంగానే భర్తీ చేస్తారు. మొత్తం ఖాళీల్లో 80 శాతం మహిళలకు, 20 శాతం పురుషులకు కేటాయించారు.
ఎన్‌ఓఆర్‌సెట్‌ అర్హత సాధించిన వారికి సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించి అనంతరం మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం పోస్టులను భర్తీచేస్తారు. ఇలా కొలువులో చేరిన వారిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు.

పరీక్ష విధానం
ఎన్‌ఓఆర్‌సెట్‌ను ఆబ్జెక్టివ్‌ విధానంలో 200 ప్రశ్నలకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. మొత్తం ప్రశ్నల్లో 180 సబ్జెక్టుకు సంబంధించినవి కాగా, మిగిలిన 20 ప్రశ్నలు జనరల్‌ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. అలాగే తప్పు సమాధానానికి మార్కులో మూడోవంతు తగ్గిస్తారు. ఈ పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి.
అర్హత మార్కులు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 50శాతం, ఓబీసీలు-45 శాతం, ఎస్సీ/ఎస్టీలు 40శాతం అర్హత మార్కులుగా సాధించాలి. దివ్యాంగులకు వారి కేటగిరిని అనుసరించి 5 శాతం మార్కుల సడలింపు లభిస్తుంది.

సిలబస్‌
ఈ పరీక్షలో సబ్జెక్టు విభాగంలో అడిగే ప్రశ్నలు బీఎస్సీ నర్సింగ్‌ సిలబస్‌ నుంచే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు నాలుగేళ్ల బీఎస్సీ సిలబస్‌ను క్షుణ్నంగా చదవాలి. అలాగే గతంలో నిర్వహించిన పరీక్ష పత్రాలను, ఎమ్మెస్సీ నర్సింగ్‌ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.05.2023
  • సీబీటీ పరీక్ష తేదీ: 03.06.2023
  • వెబ్‌సైట్‌: https://norcet4.aiimsexams.ac.in/

చ‌ద‌వండి: 3055 Nursing Jobs: ఎయిమ్స్, న్యూఢిల్లీలో నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date May 05,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories