RRB ALP Recruitment: రైల్వేలో 5696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అర్హులు వీరే..

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీల సంఖ్య: 5696
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనున్న అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసుండాలి. మెకానికల్(Mechanical), ఎలక్ట్రికల్(Electrical), ఎలక్ట్రానిక్స్(Electrical), ఆటోమొబైల్(Automobile) ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి. అంతే కాకుండా ఏఐసీటీఈ గుర్తింపు విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎక్స్-సర్మీస్‌మెన్, మహిళలకు రూ.250. ఇతరులకు రూ.500.
వయసు: 01-07-2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200
ఎంపిక విదానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT)లో మెరిట్, మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితర ప్రక్రియల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 20-01-2024
దరఖాస్తుకు చివరి తేదీ: 19-02-2024